Thursday, May 16, 2024

క్రిమినల్ మైండ్‌ను పాక్ విడిచిపెట్టడం లేదు: రాజ్ నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్న వాళ్లందరూ విధులకు న్యాయం చేస్తారని భావిస్తున్నానని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌లో శనివారం ఉదయం పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. తాము పాకిస్థాన్‌తో పంచాయతీ పెట్టుకోవాలని కోరుకోవడంలేదని శాంతిగా ఉండాలనుకుంటున్నామన్నారు. దేశానికి హాని తలపెడితే మాత్రం ఊరుకోమన్నారు. ఇది కొత్త భారత దేశమని, చాలా బలంగా ఉన్నామని, ఎక్కడ నుంచి దాడి చేసిన తిప్పి కొట్టగలిగే శక్తి సామార్థ్యాలు తమకు ఉన్నాయని పాక్ ను హెచ్చరించారు. నాలుగు యుద్ధాలు ఓడిన తరువాత కూడా క్రిమినల్ మైండ్‌ను పాక్ విడిచిపెట్టడం లేదని, కశ్మీర్‌లోని భారత్-పాక్ సరిహద్దులో పాక్ తీవ్రవాదులు చేస్తున్న అరాచకాలను భద్రతదళాలు ఎండగడుతున్నాయని రాజ్ నాథ్ పేర్కొన్నారు. సరహద్దులో పాకిస్తాన్ చొరబాటుదారులకు గట్టిగా భద్రతా దళాలు బుద్ధి చెబుతున్నాయని, 1971 లాంగేవాలా యుద్ధం నుంచి బాల్‌కోట్ వరకు వైమానిక దళం పదర్శించిన దైర్య సహసాలు చరిత్రలో నిలిచిపోతాయని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News