Monday, April 29, 2024

ఐదు ఫోన్లను ధ్వంసం చేసిన కీలక సూత్రధారి

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు దర్యాప్తులో వెల్లడి
ఆరవ నిందితుడు మహేష్ కుమావత్ అరెస్టు

న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో ప్రధాన స్రూధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝాఢిల్లీలో పోలీసులకు లొంగిపోయే ముందు ఐదు ఫోన్లను ధ్వంసం చేశాడని, అంతేగాక దర్యాప్తు బృందాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఘటన అనంతరం రాజస్థాన్‌లోని కుచ్చమన్‌కు పారిపోయిన లలిత్ తన సహచరులు నలుగురి ఫోన్లతోపాటుతన ఫోన్‌ను కూడా ధ్వంసం చేశాడని వర్గాలు తెలిపాయి. లలిత్‌తోపాటు, మిగిలిన నలుగురు నిందితుల ఫోన్లకు సంబంధించిన సమాచారం అందచేయాలని దర్యాప్తు బృందం సెల్యులర్ కంపెనీలకు లేఖ రాసినట్లు వారు వివరించారు.

లలిత్‌తోపాటు ఇతర నిందితులు పోలీసులకు చెబుతున్న విషయాలు ఏమైనప్పటికీ ప్రత్యేక విభాగం బృందం మాత్రం క్షేత్రస్థాయిలో వాటిని నిర్ధారించుకుంటోందని వారు తెలిపారు. నిందితుల వాంగ్మూలాలన్నీ అబద్ధాలని రుజువవుతోందని, పోలీసులను తప్పుదారి పట్టించడానికే వారుఆ విధంగా మాట్లాడుతున్నారని వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ప్రధాన పూత్రధారి, ఐదవ నిందితుడైన లలిత్ ఝా తన మిత్రుడు మహేష్‌తో కలసి తన సహచరుల మొబైల్ ఫోన్లతోపాటు తన ఫోన్‌ను కూడా రాజస్థాన్‌లోని కుచ్చమన్‌కు వెళ్లిన తర్వాత కాల్చివేసినట్లు వర్గాలు చెప్పాయి.

పార్లమెంట్‌లో ఘటన జరగడానికి ముందుగానే నలుగురు నిందితులు తమ మొబైల్ ఫోన్లను లలిత్‌కు అందచేశారని, తమ అరెస్టు అనివార్యమని భావించిన నిందితులు కీలక సమాచారం పోలీసులకు లభించకూడదన్న ఉద్దేశంతోనే ఈ పని చేశారని వారు చెప్పారు. కుచ్చమన్‌లో తన మిత్రుడు మహేష్‌ను లలిత్ కలుసుకోగా లలిత్‌కు రాత్రికి ఒక గదిని ఏర్పాటు చేసి ఇచ్చాడని వారు చెప్పారు. వారిద్దరూ ఫేస్‌బుక్ ద్వారా మిత్రులయ్యారని, ఈ విషయాన్ని లలిత్ దర్యాప్తులో వెల్లడించాడని వారు తెలిపారు. అయితే లలిత్ చెప్పిన విషయాలన్నిటినీ పోలీసు బృందం ధ్రువీకరించుకుంటోందని వారు చెప్పారు.

పార్లమెంట్‌లోకి ఇద్దరు నిందితులు ప్రవేశించగా మరో ఇద్దరునిందితులు పార్లమెంట్ వెలుపల స్మోక్ బాంబులు ప్రయోగించి నినాదాలు చేశారు. ఈ దృశ్యాన్ని మీడియాకు అందచేయడానికి తన సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు. లలిత్‌తోపాటు ఇతర నలుగురు నిందితులు చాలాసార్లు కలుసుకుని కుట్రను రూపొందించారని పాలియాలా హౌస్ కోర్టుకు ఢిల్లీ పోలీసుకు చెందిన ప్రత్యేక విభాగం తెలియచేసింది. అలజడి సృష్టించడం ద్వారా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నదే నిందితుల ఉద్దేశమని కోర్టుకు పోలీసులు తెలియచేశారు.

ఆరవ నిందితుడు మహేష్ అరెస్టు
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కేసులో ఆరవ నిందితుడు మహేష్ కుమావత్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారి లలిత్ ఝా ఢిల్లీ నుంచి పరారీ కావడంలో సహాయపడిన మహేష్ కుమావత్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ డిసెంబర్ 13న పార్లమెంట్‌లో ఇద్దరు నిందితులు సృష్టించిన అలజడి ఘటనను రిక్రియేట్(పునఃసృష్టించడం) చేసేందుకు పార్లమెంట్ అనుమతిని పోలీసులు కోరనున్నట్లు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News