Friday, May 17, 2024

తండ్రిని మించిన తనయుడు!

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఇక అదే తరహాలో ఆయన తనయుడు అకిరా నందన్ కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. అతనికి సంబంధించిన ఒక్క ఫొటో విడుదలైనా కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇక తాజాగా అకిరా ఫొటోలు మరిన్ని బయటకు రావడంతో ఒక్కసారిగా అవి ట్రెండ్ లిస్ట్‌లోకి చేరిపోయాయి. తన తండ్రి పవన్‌తో అకిరా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో పవన్ కంటే హైట్‌గా అకిరా కనిపించి ఆకట్టుకుంటున్నాడు. ఇక పవన్‌కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ అంటే మెగా అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. టీనేజ్ వయసులోనే అకిరా తన హైట్‌తో అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు 17ఏళ్లకు వచ్చేయడంతో అన్నయ్య వరుణ్ తేజ్ కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News