Monday, April 29, 2024

సెప్టెంబర్‌లో తిరిగి సెట్స్‌పైకి…

- Advertisement -
- Advertisement -

 

Pawan news film is vakeel saab in tollywood
పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఆయన నుండి రెండేళ్ల తరవాత వస్తున్న మూవీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పవన్ కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడింది. కేవలం 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రం షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలవుతుందని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ‘వకీల్ సాబ్’ షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలు అవుతుందని తెలిసింది. షూటింగ్ త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరలో ఈ మూవీని విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ఆలోచనట. అయితే ఈ ప్రణాళికలన్నీ అమలు కావాలంటే సాధారణ పరిస్థితులు ఏర్పడితేనే జరుగుతుంది. ‘వకీల్ సాబ్’ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News