Monday, April 29, 2024

భారత్‌లో అతిపెద్ద పేటిఎం ఐపిఓ ప్రారంభం!

- Advertisement -
- Advertisement -

Paytm IPO

ముంబయి: భారత అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపిఓ) అయిన పేటిఎం ఐపిఓ సోమవారం ప్రారంభమైంది. పెద్ద నోట్ల రద్దు అయిన ఐదేళ్లకు ఈ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఐపిఓ మార్కెట్‌లోకి వచ్చింది. రూ. 8235 యాంకర్ అలాట్‌మెంట్ 10 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. ఆ యాంకర్ అలాట్‌మెంట్‌కు బ్లాక్‌రాక్, సిపిపిఐబి, జిఐసి వంటివి లైన్‌కట్టాయంటే ఈ ఐపిఓ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. యాంకర్ రౌండ్‌లో ఇప్పటికే 45 శాంత సబ్‌స్క్రయిబ్ అయిపోయింది. ఐపిఓలో 75 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబి)లకు రిజర్వు చేశారు.

భారత్‌లో పేటిఎం అతిపెద్ద పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌గా ఉంది. 97 కమూ్యనికేషన్స్ యాజమాన్యం కింద పనిచేస్తున్న పేమెంట్స్ ప్లాట్ ఫారం. పేటిఎం ఐపిఓ రూ. 18300 కోట్లు. దాని ప్రైస్ బాండ్ షేరు ఒక్కింటికి రూ. 2080-రూ. 2150 మధ్య ఫిక్స్ చేశారు. జూన్ 30 నాటికి పేటిఎంలో 33.70 కోట్ల కస్టమర్లు, 2.2 కోట్ల మంది వ్యాపారులు రిజిష్టరు అయి ఉన్నారు. సంవత్సరానికి పేటిఎం 80 బిలియన్ డాలర్ల చెల్లింపులను హ్యాండిల్ చేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరపు వాలెట్ చెల్లింపుల లావాదేవీల్లో 67 నుంచి 70 శాతం వాటా పేటిఎందే. కాగా ఈ కంపెనీ లాభాల గురించి మాట్లాడటం అభిలషణీయం కాదని ఈక్విటీమాస్టర్‌లో సీనియర్ రీసెర్చ్‌గా పనిచేస్తున్న రిచా అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ కంపెనీ ఇంకా చాలా ఎదగాల్సి ఉందన్నారు. కరోనా మహమ్మారి కాలంలో డిజిటల్ వాలెట్, మొబైల్ పేమెంట్స్ లావాదేవీలు బాగా పెరిగాయన్నది యధార్థం. పేటిఎం ఆపరేటింగ్ మార్జిన్ 2026 నాటికి 5 శాతంకు చేరుకోవచ్చని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశ్వథ్ దామోదరన్ అభిప్రాయపడ్డారు. ఆయన ఈ షేరు ధరను ప్రస్తుత ఐపిఓ ప్రైస్ బాండ్ రూ. 2080-2150 రేంజ్ కన్నా ఎక్కువగా అంటే.. రూ. 2190.24 వాల్యూ ఉంటుందని లెక్కించారు.2010లో కోల్‌ ఇండియా తీసుకొచ్చిన రూ.15,200 కోట్ల ఐపిఓనే ఇప్పటి వరకు ఇండియాలో అతిపెద్దది. అసలు భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద ఐపిఓ పేటిఎం ఐపిఓఅని కూడా చెప్పవచ్చు. ఐపిఓ వివరాలు ఇవి:

ఐపిఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: నవంబరు 8, 2021

ఐపిఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: నవంబరు 10, 2021

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: నవంబరు 15, 2021

రీఫండ్‌ ప్రారంభ తేదీ: నవంబరు 16, 2021

డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: నవంబరు 17, 2021

మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: నవంబరు 18, 2021

ముఖ విలువ: రూ.01 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

లాట్‌ సైజు: 06 షేర్లు

కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 06 (ఒక లాట్‌)

గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 90 (15 లాట్లు)

ఐపిఓ ధర శ్రేణి: రూ. 2,080 -రూ. 2150 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News