Saturday, April 27, 2024

విటమిన్లకు విపరీతమైన గిరాకీ

- Advertisement -
- Advertisement -

విటమిన్ టాబ్లెట్స్‌కి పెరిగిన డిమాండ్
50 శాతం పెరిగిన డ్రైఫ్రూట్స్ వినియోగం
పండ్లు, ఆకుకూరలతో ఇమ్యూనిటీ పెంపుదల
ట్రెడ్మిల్, సైక్లింగ్‌పై పెరిగిన ఆసక్తి

People eat vitamin c fruits at telangana

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నానాటికి కోరలు చాస్తోంది. కరోనా దరి చేరకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి పెంపుదలే ఏకైక మార్గమని చెబుతున్నారు. ఈక్రమంలో విట మిన్ డి3, జింకోవిట్, బీకాంప్లెక్స్, విటమిన్ సి, పారాసెటిమా ల్, అజిత్రో మైసిన్ టాబ్లెట్స్‌కు గిరాకీ పెరిగింది. ముందు జాగ్రత్తగా వాటిని మందుల షాపుల నుంచి కొనుగోలు చేసి భద్రపరుస్తున్నారు. కోవిడ్ బాధితులు ఆహారం తినలేరు కాబట్టి వారికి విటమిన్ టాబ్లెట్స్ తప్పసరిగా అందించాల్సి ఉంటుంది. మిగిలిన వారంతా ఆయా ట్లాబ్లెట్స్ జోలికి వెళ్లకుండా పండ్లు, ఆకుకూరలను భుజించడం ఎంతైనా శ్రేయస్కరం. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ కరోనా అదును చూసి పంజా విసురుతోంది. ఈ పరిస్థితు ల్లో తమ తమ ఇళ్లల్లో వున్న వృద్ధులు, పిల్లల
సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తాము కూడా కరోనా కాటు కు గురికాకుండా అనువైన చర్యలను చేపడుతున్నారు. ఇమ్యూనిటి పెంపులో కీలకమైన డ్రైఫ్రూట్స్‌ని విరివిగా వినియోగిస్తున్నారు. గతం కంటే 50 శాతం మేర డ్రైఫ్రూట్స్ అమ్మకాలు పెరిగాయని ఆయా దుకాణదారులు చెబుతున్నారు. శొంఠి, యాలకులు, లవంగాలకు సైతం డిమాండ్ పెరిగింది. కరోనాకు ముందు నెలకు రెండు కిలోల శొంఠి విక్రయించేవాళ్లు ప్రస్తుతం పది కిలోల వరకు విక్రయిస్తున్నారు.
అలవాటు లేకపోయినా…
మరోవైపు ఇంతవరకు వేడి నీరంటే ముట్టని వారు సైతం రోజు ఉదయాన్నే కాచిన నీరు తాగుతున్నారు. వాటిలో పసుపు, నిమ్మరసం వంటి వాటిని చేర్చి మరింతగా శరీరానికి అందిస్తున్నారు. ఆవిరి పట్టుకోవడమనేది నిత్యకృత్యంగా మారింది. ఇలా పలు విధాలుగా, పలు రకాలుగా కరోనా విలయాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఇతరత్రా చిట్కాలను సైతం ఉపయోగిస్తున్నా రు. ప్రధానంగా తమ తమ ఇళ్లల్లో శుచి, శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పూర్వకాలంంలో ఇంట్లోకి రావాలంటే కాళ్లు కడుక్కొని మరీ రావాల్సి ఉండేది. ఆనాడు షేక్ హ్యాండ్‌ల సంస్కృతే లేదు. నమస్కారం, ప్రతి నమస్కారం మన సంస్కృతిగా కొనసాగేది. క్రమేపి ఆ సంస్కృతులు కనుమరుగయ్యాయి. ఈనాడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనబడటం లేదు. తత్పలితమే నేడు ఒక చిన్న క్రిమి తన ప్రతాపాన్ని బలంగా చాటడానికి కారణమవుతోంది. దీంతో ప్రస్తు తం కరోనా భయానికి ప్రజలంతా భౌతిక దూరంతో పాటు స్వీయ నియంత్రణకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందులో భాగంగానే మీరు మా ఇంటికి రావొద్దు.. మేము మీ ఇంటికి రాము అని కుండబద్దలు గొడుతున్నారు. కరోనా అంతగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.


ఇంటిపట్టునే ఉంటూ ఆరోగ్యానికి, వ్యాయామానికి ప్రాధాన్యత
గతంలో మాదిరిగా రోడ్లపై సంచరించేందుకు ఎవ్వ రూ ఇష్టపడటం లేదు. కనీసం ఉదయం వాకింగ్‌కు వెళ్లేందుకు సైతం జంకుతున్నా రు. ఇంట్లోనే వ్యాయామానికి అనువైన ట్రెడ్మిల్‌పై కొంతసేపు సాధన చేస్తున్నారు. ట్రెడ్మిల్ సౌకర్యం లేని వారు సైక్లింగ్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. అదీ కూడా సాధ్యపడని వారు ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నారు.
ఇలా ఇంటి పట్టునే ఉంటూ
ఓ వైపు ఆరోగ్య సూత్రాలను పాటించడంతో పాటు మరో వైపు వ్యాయామానికి అంతే సమయం కేటాయిస్తున్నారు. గతం కంటే ప్రస్తుతం సైకిళ్లు సేల్స్ అమాం తం పెరిగాయి. పట్టణ ప్రాంతా
ల్లోనే కాదు.. పల్లెల్లోనూ సైకిళ్ల విక్రయా లు జోరందుకున్నాయని చెబుతున్నారు. కరోనా ప్రజల్లో అనూహ్య మార్పులను తీసుకువచ్చిందనే చెప్పాలి.
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ…
కరోనా ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. కళాశాలలు, స్కూల్స్ మూతపడటంతో ఇంటి పట్టునే పిల్లలు ఉంటున్నారు. వారి ఆల నా పాలనా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. వారిలో ఇమ్యూనిటీ పెంపుకు కృషి చేస్తున్నారు. ఖాళీగా ఉండటంతో వారు స్మార్ట్ ఫోన్‌ల ను విరివిగా వినియోగించే అవకాశం ఉంది. దీని పట్ల సైతం కన్నేసి ఉంచారు. స్మార్ట్ ఫోన్‌లకు కొంత సమయం మాత్రమే వారు కేటా యించేలా తగు చర్యలు చేపడుతున్నారు.
నిర్లక్షం.. విచ్చలవిడితనమే కారణమా?
విచ్చలవిడితనం ప్రజ్వరిల్లటం, ఏమీ కాదులే అన్న నిర్లక్షం అడుగడుగునా ఒంటబట్టించుకున్న వారికి కరోనా తగిన గుణపాఠం నేర్పుతోంది. దీంతో సమూహాలుగా ఏర్పడటంలేదు. రైతుబజార్లకు వెళ్లడంలేదు. బయట ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా మాస్కులు, భౌతికదూరానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆదమరిస్తే కరోనా కాటుకు గురవ్వాల్సి రావడం ఖాయమన్న భావన క్రమేపీ బలపడుతూ వస్తోంది. కరోనా కొంగొత్త పాఠాలను, కనుమరుగైపోయిన పాత సంప్రదాయాలను అలవర్చుకునేలా చేసినట్లైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News