Monday, April 29, 2024

రాజకీయాలు కాదు.. అభివృద్ధి ముఖ్యం

- Advertisement -
- Advertisement -

PM Modi addresses in AMU centenary celebrations

 

ఎఎంయు ఉత్సవాలలో ప్రధాని మోడీ వ్యాఖ్య

అలీగఢ్: రాజకీయాలు తర్వాతైనా చేసుకోవచ్చని, కాని అభివృద్ధి మాత్రం ఆగకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం అలీఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఎఎంయు) శతాబ్ది ఉత్సవాలలో భాగంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అభివృద్ధిని రాజకీయ దృక్కోణంలో చూడరాదని హితవు పలికారు. ఎవరి పేరును ఆయన నేరుగా ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యల చేశారు.

ప్రతికూలతను ప్రచారం చేసే వ్యక్తులు అన్నిచోట్ల కనిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవ భారతాన్ని నిర్మించుకునేందుకు ఒక ఉమ్మడి వేదిక కావాలని, అదే ఆత్మనిర్భర్ భారత్ అని ప్రధాని చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా ముస్లిమ్ విద్యార్థినులలో డ్రాఅవుట్లు బాగా తగ్గిపోవడం సంతృప్తికరమని ఆయన అన్నారు.

ట్రిపుల్ తలాఖ్ దుర్వినియోగం అంతం అయిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎఎంయు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేశారు. ఐదు దశాబ్దాల తర్వాత ముఖ్య అతిథిగా ఎఎంయు ఉత్సవాలలో ఒక ప్రధాని పాల్గొనడం ఇదే మొదటిసారి. 1964లో చివరిగా అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఎఎంయు ఉత్సవాలలో పాల్గొన్నారు. అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు 1948లో ఎఎంయు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆ తర్వాత నెహ్రూ వరుసగా 1955, 1960, 1963 సంవత్సరాలలో ఎఎంయును మొత్తం నాలుగుసార్లు సందర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News