Monday, April 29, 2024

ఆటంకాలు ఎదురైనా.. అభివృద్ధి ఆగలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత అయిదేళ్లలో అద్భుతమైన ఫలితాలను సాధించామని, కరోనా వంటి అనేక ఆటంకాలు ఎదురయినా అభివృద్ధి మాత్రం ఆగలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. ఎన్నో తరాలు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిర్ణయాలను ప్రస్తుత లోక్‌సభ కాలంలో తీసుకున్నామన్నారు. ఆర్టికల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి వాటిని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. సభలో ‘రామమందిరం’పై తీర్మానం.. భావి తరాలకు దేశ విలువలపై గర్వపడేలా రాజ్యాంగపరమైన ధైర్యాన్ని ఇస్తుందన్నారు.తమ పాలనలో రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌లపై  దృషిసారించినట్లు ప్రధాని తెలిపారు. స్వాతంత్య్ర సాధన లక్షాలను నిత్యం స్మరించుకుంటున్నామని, వాటి సాధన దిశగా తమ పాలన కొనసాగుతోందని అన్నారు. మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారుతామని.. ‘వికసిత్ భారత్’ ఫలాలు మన బావి తరాలకు అందుతాయని చెప్పారు. జి20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని,దీంతో విశ్వవేదికపై దేశ ప్రతిష్ఠ మరింత ఇనుమడించిందన్నారు. సంస్కరణలు తీసుకు రావడం, పనులు చేయడం, కళ్ల ముందు మార్పు రావడం చాలా అరుదని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని స్పీకర్ ఓం బిర్లా, ఎంపిల పాత్రను కొనియాడారు. గతంలో లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన సుమిత్రా మహాజన్ పలు సందర్భాల్లో సరదాగా మాట్లాడే వారని, ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా ముఖం ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుందన్నారు. అనేక సందర్భాల్లో స్పీకర్ సభను స్ఫూర్తివంతంగా నడిపించారన్నారు. ఓపికతో, విజ్ఞతతో వ్యవహరించారని, అందుకు రుణపడి ఉంటానన్నారు ప్రధాని మోడీ. అయిదేళ్లలో మానవ జాతి ఈ శతాబ్దంలోనే అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొందన్న ఆయన కరోనా పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో సభకు రావడం కూడా రిస్క్‌తో కూడుకున్న పనని ప్రధాని అంటూ..ఆ సమయంలోనూ సభను నిర్వహించారని కొనియాడారు. కొవిడ్ సమయంలో ఎంపి ఫండ్స్‌ను వదులుకొనే ప్రతిపాదన వచ్చినప్పుడు సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలకు సానుకూల సందేశం ఇవ్వాలని, సమాజానికి విశ్వాసం కల్పించేందుకు ఎంపిలందరూ తమ జీతాలను 30 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. కొత్త పార్లమెంటు భవనం కావాలని అందరూ చర్చించుకున్నారని.. కానీ మీ నాయకత్వమే ఈ పనిని ముందుకు తీసుకెళ్లిందన్న ప్రధాని .. నేడు దేశానికి కొత్త పార్లమెంటు భవనం వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News