Monday, April 29, 2024

సుప్రీంతీర్పు ఓ ఆశాకిరణం ప్రధాని మోడీ హర్షం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని కొనియాడారు. ‘ ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం. 2019 ఆగస్టు 5న పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ సోదర సోదరీమణుల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే ప్రకటన ఇది.

భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యతను సుప్రీంకోర్టు మరోసారి బలపర్చింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజల కలలను నెరవేర్చేందుకు మేం నిబద్ధతతో ఉన్నాం. ఆర్టికల్ 370తో నష్టపోయిన వారందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తాం.ఈ రోజు తీర్పు కేవలం చట్టపరమైనదే కాదు,.. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉజ్వల భవితకు వాగ్దానం. బలమైన ఐక్య భారత్‌ను నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’ అని ప్రధాని ఎక్స్ వేదికగా చేసిన ఓ ట్వీట్‌లో ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News