Sunday, April 28, 2024

ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని మూసేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఇడి అరెస్టు చేసిన క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు ఆప్ ప్రధాన కార్యాలయం సమీపంలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. అయితే, ఆప్ కార్యాలయం సమీపంలోనే బిజెపి ఆపీస్ కూడా ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లోనూ ఆప్ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్న ఈక్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. పార్టీల కార్యాలయాల దగ్గర భారీగా పోలీసులు మోహరించి ఆందోళనలను అడ్డుకున్నారు.

ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆప్ కార్యాలయానికి తాళం వేసి మూసేశారు. కార్యాలయం వైపు ఎవరినీ వెళ్లనీయకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆదేశాలతోనే ఆప్ కార్యాలయాన్ని మూసివేశారని మండిపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ మా పార్టీ కార్యాలయాన్ని ఎలా మూసేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆప్ మంత్రులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News