Friday, May 17, 2024

మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -
police raid massage centres in hyderabad
ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులు అరెస్టు

హైదరాబాద్: అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం రావడంతో బంజారాహిల్స్ పోలీసులు ఓ మసాజ్ సెంటర్‌పై గురువారం దాడి చేసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ మసాజ్ సెంటర్‌కు కొందరు విఐపిలను తీసుకొని వచ్చి అశ్లీల కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News