Monday, April 29, 2024

ధనిక నియోజకవర్గాల్లో విజేతలు ఎవరో?

- Advertisement -
- Advertisement -

(బి.అంజన్ కుమార్/మన తెలంగాణ)
నగరంలో ధనిక నియోజకవర్గాల్లో ఎవరిని విజయం వరించనుందన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్ ఎలా ఉండనున్నది, సిట్టింగ్ ఎమ్మెల్యేలే మళ్లీ వాటిని దక్కించుకోనున్నారా లేక ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టని కొత్తవారు పాగా వేస్తారా అన్న చర్చ జోరుగా చర్చ సాగుతోంది. గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలుండగా అందులో శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ స్థానాలకు ధనిక నియోజవర్గాలుగా పేరుంది.

ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో అధిక సంఖ్యలో ధనికులు నివసిస్తుండడమే కాకుండా పన్నుల రూపంలో అధిక ఆదాయం కూడ ఈ నియోజకవర్గాల నుంచే సమాకూరుతోంది. అంతేకాకుండా ఈ మూడు నియోజకవర్గాలో పరిధిలోనే అత్యధికంగా ఐటి సంస్థలు, అంతర్జాతీయ సంస్థల కేంద్రాలతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌గా కూడ ఉంది. ఈ మూడు నియోజవర్గాల్లో అత్యధిక ధనవంతులతో పాటు మధ్య తరగతి, అట్టడగు నిరు పేదలు ఉన్నారు.

ఖైరరాబాద్ నియోజకవర్గం
ఈ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మె ల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నుంచి దివంగత నాయకులు పి.జనార్ధన్‌రెడ్డి తనయ పి. విజయారెడ్డి, బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు బరిలో ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి నియోజవర్గం నుంచి రెండుసార్లు వరసగా విజయం సాధించగా మూడోసారి సైతం విజయం తనదేనన్న నమ్మకంతో ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న విజయా రెడ్డి ప్రస్తుతం ఇక్కడి నుంచి కార్పొరేటర్‌గా ప్రతినిధ్యం వహిస్తుండడంతో తనకు బలంతో పాటు నగరంలో నే మాస్ లీడర్‌గా పేరొందిన తన తండ్రి జనార్ధన్ రెడ్డి పేరు ప్రఖ్యాతలు తనకు అదనపు బలమన్న నమ్మకంతో విజయా రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నియోజకవర్గం నుంచి గెలు పొందిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి 2023లో మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో ప్రచారం కొనసాగిస్తున్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం
ఇక్కడి నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ తిరిగి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, బిజెపి నుంచి లంకెల దీపక్ రెడ్డి, ఎంఐఎం నుంచి షేక్ రషీద్ ఫర్హారుద్దీన్‌లు బరిలో ఉన్నారు. ఇందులో మాగంటి గోపీనాధ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా, కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం అభ్యర్థులు మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరీలో ఉన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం
ఈ నియోజక వర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పోటీలో ఉండగా ఇటీవల వరకు జిహెచ్‌ఎంసిలో బిఆర్‌ఎస్ ప్లోర్ లీడర్‌గా ఉన్న వి. జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. అదేవిధంగా బిజెపి నుంచి బి.రవికుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. గెలుపు కోసం ఈ మూడు పార్టీల అభ్యర్థులు ఎవరికీ వారు తమ దైన శైలిలో ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం ముందు ఆ తర్వాత కూడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరికెపూడి గాంధీ అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News