Monday, April 29, 2024

చరణ్‌కు జోడీగా పూజా

- Advertisement -
- Advertisement -

Pooja Hegde will co-star with Ramcharan

 

మెగాస్టార్ చిరంజీవి 152వ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్ ఎలిమెంట్స్‌తో మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో సినిమా ఇది. ఇదివరకు చిరు, కాజల్ కలిసి ‘ఖైదీ నెం.150’ మూవీలో నటించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్న విషయం విదితమే.

ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా హీరోయిన్ ఉంటుందని మేకర్స్ ఇదివరకే తెలిపారు. ఇంతకాలం ఆ హీరోయిన్ని వెతికే పనిలో పడింది చిత్రబృందం. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఓకే చేసినట్లు సమాచారం. మొన్నటివరకు చరణ్‌కు జోడీగా కియారా, రష్మిక లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ చివరికి పూజా ఖరారైందట. ప్రస్తుతం పూజ.. భారీ సినిమాలతో బిజీగా ఉంది. ‘ఆచార్య’ సినిమాలో చిన్న నిడివి గల పాత్ర ఆమె చేయనుంది. ఇదివరకు ‘రంగస్థలం’ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌లో చరణ్‌తో పూజా ఆడిపాడింది. ఈసారి హీరోయిన్‌గా ఆమె నటిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News