Saturday, April 27, 2024

నేపాల్ ప్రధానిగా కమల్ దహల్ ‘ప్రచండ’

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండు: మాజీ మావోయిస్టు నాయకుడు పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ మూడోసారి నేపాల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు దేవి భండారీ ఆయనను ప్రధానిగా నియమించిన మరునాడే ఈ ప్రమాణస్వీకారం చేశారు. శీతల్ నివాస్‌లో అధికారిక ప్రమాణస్వీకారోత్సవంలో అధ్యక్షుడు భండారీ 68 ఏళ్ల ఆ మాజీ గెరిల్లా నాయకుడితో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతినిధుల సభలో మొత్తం 275 సభ్యులలో 169 మంది మద్దతు తెలుపగా ప్రచండ నేపాల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.

నేపాల్ ప్రజా ప్రతినిధుల సభలో నేపాలి కాంగ్రెస్‌కు 89 సీట్లున్నాయి. అదే అతి పెద్ద పార్టీ. కాగా సిపిఎన్‌–యుఎంఎల్, సిపిఎన్‌–ఎంసిలకు 78, 32 సీట్లున్నాయి. ప్రధానిగా మెజారిటీ సాధించిన ప్రచండ ఇక 30 రోజుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(4) ప్రకారం ‘ఓట్ ఆఫ్ ట్రస్ట్’ నెగ్గాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News