Monday, April 29, 2024

నేడు అన్ని జిల్లాల్లో ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఎరువుల దుకాణాలను.. రైతులకు అన్నిరకాల సహాయాన్ని, సూచనలను అందించే ‘వన్ స్టాప్ మోడల్ ఫర్టిలైజర్ షాపులు’గా.. మారుస్తూ ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. మొదటి విడతగా.. 1.25 లక్షల ఎరువుల దుకాణాలను గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్ నుంచి ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4900 ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాలు’గా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో జరగనున్న కార్యక్రమాల్లో రైతులు,

రైతు సంఘాల నాయకులతోపాటు.. బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. శామీర్‌పేట్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొంటారు. మంచిర్యాల జిల్లాలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి, సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, షాద్‌నగర్‌లో ఈటల రాజేందర్, సూర్యాపేటలో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్‌లో బి జితేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, వరంగల్ జిల్లాలో ప్రేమేందర్ రెడ్డి, జనగాం జిల్లాలో రవీంద్ర నాయక్, ఖమ్మంలో కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులతో పాటు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు వివిధ జిల్లాలలో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News