Thursday, May 16, 2024

ఆరు నెలల్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట : ఎయిమ్స్ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

Prevent corona outbreak in six months: AIIMS Director

 

న్యూఢిల్లీ : భారత్‌లో తగిన సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ పొందడానికి దాదాపు ఆరు నెలల కాలం పడుతుందని, అలాగే కరోనా వైరస్ వ్యాప్తి గొలుసుకట్టను తెంచడానికి అంతే సమయం పట్టవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో కరోనా సోకిన వారిలో అనేక మంది కుదుటపడి రోగ నిరోధకతను పొందుతారని, మరి కొందరికి వ్యాక్సిన్ ద్వారా ఆ శక్తి లభిస్తుందని ఈ రెండిటి ఫలితంగా కరోనా గొలుసుకట్టు వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నవారికి మొదట వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కరోనా మరణాల సంఖ్య తానంతట అదే తగ్గుముఖం పడుతుందని ఆయన విశ్లేషించారు. కరోనా టీకా అందించాల్సిన వారు ప్రాథమికంగా 30 కోట్ల మంది వరకు ఉన్నారని, వారికి రెండేసి డోసుల వంతున 60 కోట్ల డోసులు అవసరమవుతాయని అంచనా వేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News