Sunday, May 12, 2024

సస్పెన్స్ థ్రిల్లర్..

- Advertisement -
- Advertisement -

శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రిన్స్, దివ్యంగనా హీరో హీరోయిన్లుగా గోపాల కిషన్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఐ యామ్ మీరా’. గుగ్గిళ్ల శివ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా దర్శకుడు గోపాల కిషన్ మాట్లాడుతూ “ఈ సినిమా కథ నచ్చి గుగ్గిళ్ల శివప్రసాద్ ప్రోడ్యూస్ చేయడానికి ముందకొచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను ఆయన నిర్మించారు”అని అన్నారు. నిర్మాత గుగ్గిళ్ల శివప్రసాద్ మాట్లాడుతూ “ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి యంగ్ హీరో ప్రిన్స్ అయితే న్యాయం చేయగలడనే ఉద్దేశ్యంతో ఆయనను తీసుకున్నాము. ఇందులో ప్రిన్స్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్‌లో ఉంటుంది. ఈ సినిమా ఆద్యంతం మంచి ట్విస్ట్‌లు, సస్పెన్స్‌తో నడుస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది”అని తెలిపారు.

Prince play negative role in ‘I Am Meera’

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News