Monday, April 29, 2024

జిపి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బస్టాండ్ వద్ద ఉన్న చిల్డ్రన్ పార్కు ఎదురుగా 5వ రోజు కొనసాగిస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారికి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. అదేవిధంగా ప్రతీ ఆదివారం సెలవు ప్రకటించడంతో పాటు పండుగలకు సెలవు ఇవ్వాలని,11వ పీ ఆర్సీ ప్రకారం ప్రతీ కార్మికులకు 25 వేల రూపాయలు ఇవ్వాలని, మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలన్నారు.

\అర్హత కలిగిన కారోబార్లు, బిల్ కలెక్టర్లకు పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించాలని,చనిపోయిన కార్మికుల దహన సంస్కారాల కోసం 30 వేల రూపాయలు ఇవ్వాలని,జీవో 51ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వారు చేస్తున్న సమ్మెకు పూర్తిగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు సాయి, తంబర్ల నరసింహారావు, జెర్పుల కళ్యాణ్, గుగులోత్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News