Monday, April 29, 2024

7 మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లు

- Advertisement -
- Advertisement -

Proposal for setting up of Mega Textile parks in India

 

మిత్రా పథకంలో భాగం

న్యూఢిల్లీ : దేశంలో మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రం ఈ బడ్జెట్‌లో తీసుకువచ్చింది. మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్స్ పార్క్ (మిత్రా)లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తారు. దేశంలో జౌళి పరిశ్రమను సరైన విధంగా ప్రోత్సహించేందుకు సరైన చర్యలు తీసుకుంటారు. జౌళి పరిశ్రమ ప్రపంచస్థాయిలో మరింత ప్రామాణికం అయ్యేందుకు, పోటీలో సరైన విధంగా నిలిచేందుకు వనరులు సమకూర్చాలని సంకల్పించారు. ఈ ఇండస్ట్రీలోకి మరింతగా పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఈ విధంగా అనుబంధంగా ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా అనుకున్న లక్షాలను నిర్ధేశిస్తారు.

దేశంలో మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లు ఏడింటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు. వచ్చే మూడేళ్లలో వీటి ఏర్పాటు జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పిఎల్‌ఐ స్కీంకు అనుబంధంగా ఈ టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు జరుగుతుంది. ఈ పార్క్‌ల ఏర్పాటు ప్రతిపాదన పట్ల కేంద్ర జవుళి మంత్రి స్మృతీ ఇరానీ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకానికి తోడుగా ఈ మిత్ర పథకంతీసుకురావడం వల్ల దేశంలో మరింతగా జవుళి పరిశ్రమకు తోడ్పాటు అందించినట్లు అవుతుందని తెలిపారు. అంతేకాకుండా భారీ స్థాయిలో పెట్టుబడులకు , మరింతగా సంబంధిత రంగంలో ఉపాధికి వీలేర్పడుతుందని స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News