Monday, April 29, 2024

పల్స్‌పోలియోకి భారీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

Pulse polio drive on January 31

హైదరాబాద్: నగరంలో చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు వేగం చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈనెల 17 నిర్వహించాల్సిన కార్యక్రమం కరోనా టీకా పంపిణీతో వాయిదా వేశారు. మళ్లీ ఈ నెల 31వ తేదీన ఐదేళ్లలోపు చిన్నారులకు టీకా వేసేందుకు వైద్యశాఖ అధికారులు ముందుకు వెళ్లుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 5,15,520మంది పిల్లలకు వేసేందుకు 2800 మంది సిబ్బంది సిద్ధం చేశారు. గ్రేటర్‌లో సుమారు తొమ్మిది లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మొదటి రోజు టీకా తీసుకుని పిల్లలకు ఇంటింటికి తిరిగి ఫిబ్రవరి 1,2 తేదీల్లో వేస్తామని, తల్లులు చిన్నారులకు తప్పకుండా టీకా వేయించి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. టీకా స్దానికంగా ఉండే డివిజన్ కార్యాలయాలు, అంగన్‌వాడీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానల్లో వేస్తున్నట్లు నగర ప్రజలు తమ సమీపంలో ఉన్న కేంద్రాలకు వెళ్లి చిన్నారులకు వేయించాలన్నారు.

ఉదయం 7గంటలకు సాయం త్రం 6గంటలకు సిబ్బంది సెంటర్లలో అందుబాటులో ఉంటారని, ప్రజలకు టీకాపై అవగాహన చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు త్వరలో ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పిల్లలు హెల్త్ సిబ్బంది ముట్టుకోకుండా చిన్నారుల తల్లిదండ్రులే నోటిలో వేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఒకవేళ టీకా వేసే సిబ్బందికి ఉంటే చిన్నారులకు వైరస్ సోకే ప్రమాదముందని అందుకోసం తల్లులు వేసేలా నిర్ణయం తీసుకున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. టీకా విజయవంతం చేసేందుకు రెడ్‌క్రాస్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వంటి స్వచ్చంధ సంస్దల సహకారం తీసుకున్నట్లు వైద్యశాఖ పేర్కొంటుంది. ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయడంతో కొంతమంది విధులకు దూరంగా ఉండటంతో పోలియో టీకా పంపిణీ సరిపడ సిబ్బంది లేవడంతో ఇతర స్వచ్చంధ సంస్దలు ముందుకు కావాలని కోరుతున్నారు.

Pulse polio drive on January 31

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News