Monday, April 29, 2024

బిజెపిని ఓడించేందుకు భారత్ డిసైడ్: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : భారత ప్రజలు బిజెపిని ఓడించి చెల్లుచీటి రాసేందుకు సిద్ధం అయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ ఆదివారం ఇప్పుడు ప్రధాన మహానగరం న్యూయార్క్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఇండియన్ ఓవరీస్ కాంగ్రెస్ యుఎస్‌ఎ ఏర్పాటు చేసిన విందుభేటీలో మాట్లాడారు. ప్రత్యేకించి ఆయన తెలంగాణ విషయాన్ని ప్రస్తావించారు. కర్నాటకలో విజయం తరువాత తమ కాంగ్రెస్ పార్టీ జోష్ పుంజుకుందని తెలిపిన తరువాతి క్రమంలో తెలంగాణలో జరిగే ఎన్నికలలో బిజెపిని మట్టి కరిపిస్తుందని, తెలంగాణలో బిజెపి కనుమరుగు అయ్యేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక్కటే కాదు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ ప్రజలు బిజెపిని ఓడించేందుకు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు.

బిజెపి విద్వేష దుకాణం బంద్ పని కేవలం కాంగ్రెస్ చేయడం లేదని, ఇందుకు ప్రజల నుంచి స్వతహస్పందన వ్యక్తం అయిందని రాహుల్ స్పష్టం చేశారు. కర్నాటకలో బిజెపిని చిత్తు చేశామని , అక్కడ వారిని ఓడించడమే కాదు, కుదేలు అయ్యేట్లు చేశామని , కర్నాటక తరువాత పలు రాష్ట్రాలలో ఇదే పలితం ఉంటుందని తెలిపిన రాహుల్ కర్నాటక ఎన్నికల తరువాత ఇప్పుడు తెలంగాణలో బిజెపి లేకుండా పోతుందన్నారు. తెలంగాణలో బిజెపిని నామరూపాలు లేకుండా చేసితీరుతామని రాహుల్ సభికుల కేరింతల నడుమ చెప్పారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో బిజెపిని టార్గెట్ చేసుకునే రాహుల్ ప్రసంగం ఎక్కువగా సాగింది. న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా హాజరైన కమ్యూనిటీ ఈవెంట్‌లో భారతీయ సంతతివారు, కాంగ్రెస్ పార్టీ మద్దతుదార్లు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ ఒక్కటే కాదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కూడా కర్నాటక ఫలితం రిపీట్ అవుతుందని రాహుల్ స్పష్టం చేవారు.

కాంగ్రెస్ వల్లనే ఈ పరిణామం ఈ మార్పు రాబోతోందని అనుకోరాదని , జనం బిజెపిని దెబ్బతీయాలనే సంకల్పానికి వచ్చారని అదే జరుగుతుందని రాహుల్ తెలిపారు. విద్వేషభరిత సిద్ధాంతాల పార్టీకి చెల్లుచీటి ఖాయం అన్నారు. వాషింగ్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో పర్యటన తరువాత రాహుల్ న్యూయార్క్‌కు వచ్చి పలు సమావేశాలలో పాల్గొంటారు, ప్రత్యేకించి మన్‌హట్టన్‌లోని జవిట్స్ సెంటర్‌లో జరిగే కమ్యూనిటీ ర్యాలీకి హాజరు కావడం కీలకం అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రజలు బిజెపి అడ్రసులేకుండా చేసేందుకు ఫిక్స్ అయ్యారని రాహుల్ తెలిపారు. విద్వేషపు బిజెపితో భవిత లేదని భారతీయులు ఓ స్థిర అభిప్రాయానికి వచ్చారని , ఈ ఫలితం ఎన్నికల్లో స్పష్టం అవుతుందన్నారు.ఈ ఏడాది రాష్ట్రాలలో బిజెపి ఓటమి ఖాతాలు తెరుచుకుంటాయని తరువాతి దశలో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందన్నారు.

ప్రతిపక్షం సమైక్యం అవుతోంది. కలిసికట్టుగా సైద్ధాంతిక పోరుకు దిగుతున్నామని అన్నారు. దేశంలో నఫ్రత్ కే బజార్ మే మెహబ్బత్ కీ దుకాణ్ ఖోలోంగే అనే తన కర్నాటక నినాదం నిజం కాబోతోందన్నారు. అమెరికాలోని భారతీయ సంతతివారిని ఉద్ధేశించి స్థానిక మేయర్ మాట్లాడుతూ ‘ మీరు ఇండియన్…అమెరికన్లు…అమెరికాను ఆపాదించుకున్నారు. అయితే భారతీయతను దూరం చేసుకోకండి’ అని కోరారు. న్యూయార్క్‌లోనే రాహుల్ అంతకు ముందు రూస్‌వెల్టు హౌస్‌లో జరిగిన మేధోమధన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు విషయాలపై ప్రముఖ విశ్లేషకులతో ముచ్చటించారు. అమెరికాలోని భారతీయ సంతతి వారు కేవలం వ్యక్తులు కాదని వారు అమెరికాలోని భారత్ రాయబార్లని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News