Monday, April 29, 2024

అనుమతుల ముసుగులో జోరుగా ఇసుక అక్రమ రవాణా

- Advertisement -
- Advertisement -

రాజోలి : జోగులాంబ గద్వాల జిల్లా, మండల కేంద్రమైన రాజోలి శివారులోని తుంగభద్రా నది పరివాహక ప్రాంతాల్లో అనుమతుల ముసుగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాత్రి , పగలు అనే తేడా లేకుండా ఇసుకను తరలించుకుపోతున్నారు. మార్కెట్లో ఒక్కో ట్రాక్టర్ సుమారు రూ. 5వేలకు పైగానే ధర పలుకుతుండటంతో అధికార పార్టీకి చెందిన కొంత మంది చోటామోటా నాయకులంతా అక్రమ ఇసుక మాఫియా పైనే దృష్టి సారించారు. దీంతో ఈ అక్రమ ఇసుక వ్యాపారం మూడు పూలు, ఆరు కాయాలుగా సాగుతుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లతో రాత్రి పగలు తేడా మైనర్లతో రాత్రి , పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా జరుపుతున్నారని, ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

అక్రమ రవాణాకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఒక్కో ట్రాక్టర్ చొప్పున అధికారులకు భారీగా ముడుపులు అందజేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తెరవెనుక ప్రజా ప్రతినిధులు కూడా అధికారులు ఇసుక మాఫియాకు వెన్నుదన్నుగా ఉన్నట్లు సమాచారం. ఇసుక రీచ్‌లకు అనుమతులు లేని ప్రాంతాలైన తూర్పు గార్లపాడు, రాజోలి గ్రామ శివారులోని తుంగభద్ర నది నుండి మన ఊరు మన బడి కార్యక్రమంలో ఒక ట్రాక్టర్‌కు అనుమతి పొంది, దాని ముసుగులో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు నది నుండి అక్రమంగా ఇసుకను తొడిస్తూ కాసులు చేసుకుంటున్నారు.

ఏ రోజుకు ఆ రోజు అధికారులకు భారీ ముడుపులు చేరుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సు లేని మైనర్లు మితిమీరిన వేగంతో రాజోలి గ్రామ నడి ఊళ్లో రహదారిపై విచక్షణారహితంగా మితిమీరిన వేగంతో రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా అధికారులు అండదండలతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ పనులకు నది నుండి అనుమతితో ఇసుకను రవాణా చేస్తే ముందు , ఏ వాహనానికి అనుమతి ఉంది …? ఏ వాహనం ఇసుకను రవాణా చేస్తుంది.

ఏ వాహనం నది నుండి ఇసుక రవాణా అవుతుందో ఆ వాహనం చేరాల్సిన చోటుకు చేరుతుందా లేదా అని గట్టి నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఇసుక మాఫియా పై గట్టి నిఘా ఉంచకపోతే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడే అవకాశం ఉందని, కనుక అధికారులు ఇప్పటికైనా మబ్బు నిద్రను వదిలేసి, అక్రమ ఇసుక మాఫియాపై గట్టి నిఘా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News