Tuesday, March 19, 2024

పర్యావరణంలో మనం ఒక భాగమని చెప్పే సినిమా..

- Advertisement -
- Advertisement -

 

రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘అరణ్య’. నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని తెలుగులో ‘అరణ్య’, హిందీలో ‘హాథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్’ పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ “రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అస్సాంలోని నిజ ఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. పద్మశ్రీ అవార్డు పొందిన ఆయన 1300 ఎకరాలలో అడివిని నాటారు. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో అడివిని నాటడం వల్ల భూమి నది కోత నుండి పరిరక్షింపబడింది. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ ‘అరణ్య’ సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను.

దర్శకుడు ప్రభు సాల్మన్‌తో ఈ సినిమా చేయడం చాలా విషయాలు నేర్చుకున్నాను. మూడు భాషల్లో ఈ సినిమా చేయడం ఎంతో కష్టం. తెలుగు, తమిళంలో సులభంగానే చేశాను. కానీ హిందీలో చేయడానికి చాలా కష్టపడ్డాను. పర్యావరణంలో మనం ఒక భాగమని చెప్పే సినిమా ఇది”అని అన్నారు. దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ “మూడు భాషల్లో 30 ఏనుగులతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా కోసం రానా చాలా కష్టపడ్డారు. ఇదొక ఐకాన్ మూవీ అని చెప్పగలను”అని తెలిపారు. డి.సురేష్‌బాబు మాట్లాడుతూ “ప్రభు తెరకెక్కించిన మైనా, కుంకి సినిమాలు చూశాను. ఆ రెండు సినిమాలు బాగా నచ్చాయి. ప్రభు నాకు ఈ కథ చెప్పినప్పుడు గొప్పగా అనిపించింది. అతని సృజనాత్మకత నాకు బాగా నచ్చింది. కమర్షియల్ పంథాలో ఈ సినిమాను ప్రభు చక్కగా తెరకెక్కించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు విశాల్, ఈరోస్ ఇంటర్నేషనల్ సిఎంఒ మానవ్ సేథీ, డిస్ట్రిబ్యూషన్ హెడ్ నందు అహుజా తదితరులు పాల్గొన్నారు.

Rana’s Aranya Movie Teaser Launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News