Sunday, April 28, 2024

అసమ్మతివాదులను బుజ్జగించేందుకే కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు

- Advertisement -
- Advertisement -
Randeep Surjewala Comments on Modi Cabinet reshuffle
కాంగ్రెస్ ఆరోపణ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలిలో జరుగుతున్న భారీ మార్పులు మెరుగైన పనితీరు కోసమో లేక పాలన కోసమో కాదని, ప్రభుత్వ వైఫల్యాలను పంచడానికి, అసమ్మతివాదులను సర్దుబాటు చేయడానికి జరుగుతోందని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బుధవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పనితీరు ప్రాతిపదికన క్యాబినెట్ విస్తరణ జరుగుతే మొదుగా పదవి నుంచి తొలగించాల్సింది సుపరిపాలనను అందచేయడంలో ఘోరంగా విఫలమైన ప్రధాని నరేంద్ర మోడీనేనని అన్నారు. తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైన ఆర్థిక మంత్రిని, హోం మంత్రిని, రక్షణ మంత్రిని తొలగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. క్యాబినెట్ విస్తరణ వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ మార్పులని ఆయన విమర్శించారు. మంత్రివర్గ సభ్యుల పనితీరు, మెరుగైన పాలనను ప్రాతిపదదికగా తీసుకుని క్యాబినెట్‌లో మార్పులు చేపట్టి ఉంటే కరోనా మహమ్మారిని అరికట్టడంలో తన బాధ్యతల నుంచి పారిపోయిన ప్రధాని మోడీని మొదటగా తొలగించాల్సి ఉంటుందని సూర్జేవాలా వ్యాఖ్యానించారు.

Randeep Surjewala Comments on Modi Cabinet reshuffle

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News