Monday, April 29, 2024

ఆకలి మంటలకు ఆజ్యం

- Advertisement -
- Advertisement -

జనాభా లెక్కలు తేలేదాక ఆకలితో మలమాడి చావాల్సిందేనా !..కేంద్ర ప్రభుత్వం ఔననే అంటోంది. పేదల ఆకలికి జనాభా లెక్కలకు లింకు పెట్టిసింది. నిరుపేదల కాలేకడుపులకు కాసిన్ని మెతుకులు వేసి ఆకలి మంటలను చల్లార్చండని చివరకు సుప్రీంకోర్టు ఆదేశించినా సరే.. బియ్యం మాటలు నరేంద్ర పాలనలో ఉడకవని తేల్చిచెప్పేసిం ది. ఎక్కవ మాట్లాడితే ఉన్న బియ్యం మెతుకులను కాడా లా గేసుకుంటామని చెప్పకనే పథకం నిధుల్లో కోతలు వేసి సుప్రీంకోర్టుకు సైతం పరోక్ష హెచ్చరికలు విసిరింది. జాతీయ ఆహార భద్రత పథకం కింద రేషన్ కార్డుల కోసం దేశంలో 10కోట్ల మంది నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్‌బి య్యం పొందేందుకు అన్ని అర్హతలు ఉండి కూడా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పెడుతున్న జనాభా లెక్కల కిరికిరితో ఆకలికి తాళలేక ఏళ్ల డొక్కలెండగట్టుకుంటూ వస్తున్నారు.

2011జనాభా లెక్కల ప్రకారం ఇచ్చిన రేషన్ కార్డు లే తప్ప ఇక అప్పటినుంచి కొత్తగా జాతీయ అహారభద్రత కింద ఇచ్చిన రేషన్‌కార్డులు ఒక్కటి కూడా లేవు. ఆ తరువా త జనాభా లెక్కలు చేపట్టినా వాటి నివేదికలు మాత్రం బయటకు రాకుండానే కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 80.9కోట్ల మందికి మా త్రమే రేషన్ బియ్యం అందిస్తోంది. దేశంలో జనాభా లెక్కలు తేల్చేబాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మెలికల మెలికలు పెడుతూ నెట్టుకొస్తోంది. అర్హత ఉన్న పేదలందరికీ రేషన్‌బియ్యం అందజేయాలని సుప్రీంకోర్టు తెల్చిచెప్పినా కేంద్రం తగ్గేదేలే అంటూ భీష్మించింది. 2021జనాభా లెక్కలకు సంబంధించిన వైఫల్యాలను మోడీ ప్రభుత్వం ఆకలితో అలమటిస్తున్న పేదల మెడకే ఉరితాళ్లుగా బిగించింది. జనాభా లెక్కలు తేలేదాక కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదేలేదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి నిరుపేదల కాలేకడుపుల్లో మరింత మంటలు రగిల్చింది.

కొత్త రేషన్ కార్డుల మంజూరు మాట అటుంచితే కేంద్ర ప్రభుత్వం ఉన్న రేషన్‌కార్డుల ఏరివేతకు సిద్దపడింద న్న విమర్శలను ఊతమిచ్చింది. అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఈనెల 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆహారభద్రత నిధులకు కోతలు పెట్టింది. జాతీయ అహార భద్రత చట్టం కింద కేంద్రప్రభుత్వం రేషన్‌కార్డు ఉన్న పేదలుకు నిత్యావసర సరుకుల అందజేతకోసం వచ్చే నేల చివరినాటితో ముగియనున్న 202223 ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించి ఆహార అమలు కోసం రూ. 2,87,194కోట్లు కేటాయించారు. ఈ నిధుల వ్య యం వచ్చే నెలాఖరుతో ముగియనుంది. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న 202324 ఆర్థ్ధిక సం వత్సరానికి గాను ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఆహారభద్రత నిధుల్లో భారీగా కోతలు వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1,99,350 కోట్లు మాత్రమే కేటాయించింది

. ఏకంగా రూ.87,844కోట్లు తగ్గించింది. దీన్ని బ ట్టి దేశంలో ఇప్పటివరకూ నిత్యావసర సరుకుల కోటాలో ప్రతినేల 5కిలోల బియ్యం పొందుతున్న 80.9కోట్ల మంది నిరుపేదల్లో 30శాతం మందికి బియ్యం అందకుండా పోయే ప్రమాదం పొంచివుందన్న ఆందోళనలు దేశవ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. ఒక వైపు ప్రపంచంలో మన దేశ జనాభా చైనాను మించి పోయిందని గొప్పలు చెప్పుకుంటుంటే మరో వైపు 130కోట్లు దాటేసిన దేశ ప్రజ ల్లో నూటికి 75శాతంపైగా ఇంకా దారిద్రరేఖకు దిగువనే మగ్గుతున్నట్టు జాతీయ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఒక పూట పనివుంటే మరోపూట పనిలేక కేంద్రప్రభుత్వం ఆహారభద్రత కింద ఇచ్చే బి య్యంతోనే కాలేకడుపులకు మెతులకు వేసి బతుకు లు వెల్లదీస్తున్న నిరుపేదలు ఉన్న కార్డులు కూడా ఊడితే ఇక దిక్కెలా అంటూ బెంబేలెత్తుతున్నారు.
బియ్యం రావు..ఉపాధి పనిలేదు!
వయసు మీరి.. జవసత్వాలు ఉడిగిపోయి ఏదైనా పనిచేసి బతుకుదామంటే శరీరం సహకరించక అతుక్కుపోయిన వారిని అటుంచితే.. కాయకష్టం చేసుకుని కడుపు నింపుకునే ఉపాధి హామీ కూలీలకు కూడా కేంద్ర బడ్జెట్ ఉన్న ఉపాధిని ఊడేలా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి బియ్యం రాకపోయినా కాయకష్టాన్నే నమ్ముకుని కూలీ నాలి చేసుకునే గ్రామీణ నిరుపేదల పాలిట కేంద్ర ప్రభుత్వం ములుకుల కొరడా ఝలిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్లోనూ భారీగా కోతలు వేసిం ది.ఉపాధి పథకానికి 202223లో రూ. 89 400కోట్లు కేట్లు కేటాయించిన మోడీ ప్రభు త్వం , వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ.60వేల కోట్లు మాత్రమే కేటాయించింది. దేశ మంతటా ఉపాధిహామీ పనిదినా ల్లో భారీగా కోతలు పడనున్నాయి. కొత్త రే షన్ కార్డు లు ఇవ్వక, అటు ఉన్న రేషన్‌కార్డుల్లో 30% కో తలు వేసి, చివరకు ఉపాధి పథకాన్నికు దించి నమ్మకంగా ఏటా 100 రోజులు దొరి కే పని కి కూడా పంగనామాలు పెట్టే ప్రయత్నాల్లో ఉ న్నారంటూ ప్రభుత్వంపై పేదలు కన్నెర్ర చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News