Monday, April 29, 2024

రేవ్ పార్టీలో పాము విషం: బిగ్‌బాస్ విజేత హస్తం

- Advertisement -
- Advertisement -

లక్నో: నోయిడాలోని సెక్టార్ 49లో ఒక రేవ్ పార్టీపై దాడి చేసిన ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు పాము విషాన్ని రేవ్ పార్టీలో ఉంచినందుకు బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్‌తోసహా ఐదుగురు ఇతరులపై శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. డ్రగ్స్ డిపార్ట్‌మెంట్, అటవీ శాఖల సమన్యవంతో రేవ్ పార్టీపై దాడి చేసిన యుపి పోలీసులు ఎల్విష్ యాదవ్ సహచరులు ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నారు.

పోలీసు వర్గాల కథనం ప్రకారం అరెస్టు చేసిన నిందితులు రేవ్ పార్టీలకు పాము విషాన్ని భారీ సొమ్ముకు విక్రయిస్తుంటారు. ఈ దాడి చేసినపుడు ఐదు నాగుపాములతోసహా మొత్తం 9 విషసర్పాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 20 మిల్లీలీటర్ల పాము విషాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 5 నాగుపాములు, ఒక కొండచిలువ, ఒక రెండుతలల పాము, ఒక త్రాచుపాము లభించినట్లు పోలీసు వరాలు తెలిపాయి.

రేవ్ పార్టీలలో పాములను, పాము విషాన్ని కొందరు వీరంతా ఉపయోగిస్తున్నారని తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. బిజెపి నాయకురాలు మేనకా గాంధీకి చెందిన స్వచ్ఛంద స్ంథ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవ్ పార్టీపై దాడి జరిపినట్లు వర్గాలు తెలిపాయి. నిందితులను అరెస్టు చేసిన సందర్భంగా ఎల్విష్ యాదవ్ వెలుగుచూసింది. ప్రస్తుతం ఎల్విష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 టైటిల్‌ను గెలుచుకోవడంతో ఎల్విష్ యాదవ్ పేరు పాపులర్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News