Thursday, May 9, 2024

మార్కెట్లోకి రియల్‌మి నార్జో సిరీస్ ఫోన్లు

- Advertisement -
- Advertisement -

Realme narzo 20 smartphone launched in india

న్యూఢిల్లీ : రియల్‌మి నార్జో సిరీస్ ఫోన్లు దేశీయ మార్కెట్లో విడుదలయ్యాయి. రియల్‌మి నార్జో 20, నార్జో 20ఎ, నార్జో 20 ప్రో ఫోన్లు భారీ బ్యాటరీ 6000 ఎంఎహెచ్ సామర్థం కల్గివున్నాయి. నార్జో 20ప్రో- 65డబ్లు చార్జింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. నార్జో 20 సిరీస్ ఫోన్లను అత్యుత్తమ సెగ్మెంట్ ప్రాసెసర్‌లు, ఫాస్ట్ చార్జ్, మెగా బ్యాటరీలను అందించడంతో పాటు అప్‌గ్రేడ్ చేసిన రియల్ మి యుఐ 2.0ను కూడా ఉంది.

రియల్‌మి నార్జో 20 (4జిబి ర్యామ్+ 64జిబి స్టోరేజ్) ధర రూ.10,499, అలాగే 128జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ.11,499గా కంపెనీ నిర్ణయించింది. నార్జో 20ఎ ధర రూ.8,499 (3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజ్), అలాగే నార్జో 20ప్రో ధర రూ.14,999 (6జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజ్), అలాగే 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

 

Realme narzo 20 smartphone launched in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News