Monday, April 29, 2024

గెస్ట్ లెక్చరర్స్‌ను కొనసాగిస్తూ వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

- Advertisement -
- Advertisement -
సిఎం కెసిఆర్‌కు కూనంనేని లేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గౌరవించి గెస్ట్ లెక్చరర్స్‌ను కొనసాగిస్తూ వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని సిఎం కెసిఆర్‌కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. శనివారం ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల యందు దాదాపు 1654 మంది గెస్ట్ లెక్చరర్స్‌గా విధులు నిర్వహిస్తున్నారని, వీరందరి ఉద్యోగాలను కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా ఇంటర్ బోర్డు గెస్ట్ లెక్చరర్స్ స్థానంలో కొత్తవారి నియామకానికి నోటిఫికేషన్ పంపించడం శోచనీయంగా ఉందన్నారు. ఈ విషయంపై హైకోర్టులో రిట్ పిటీషన్ వేయడం జరిగిందని, పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గెస్ట్ లెక్చరర్స్‌ను కొనసాగించాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిందన్నారు.

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1145 ప్రకారం గెస్ట్ లెక్చరర్స్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని, విద్యా శాఖలో జూనియర్ లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయకపోయినా విధిగా విధులును కర్తవ్యంగా స్వీకరించి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరందరూ పర్మినెంట్ ఉద్యోగాలతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని, గత 10 సంవత్సరాల నుండి గెస్ట్ లెక్చరర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వీరి ఉద్యోగాలు క్రమబద్దీకరణ చేయకపోవడం అన్యాయంగా ఉందన్నారు. ప్రభుత్వం పెట్టిన మెరిట్ ఆధారంగా, త్రీమెన్ సెలక్షన్ కమిటీ ద్వారా గెస్ట్ లెక్చరర్స్ ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందని, కావున హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు , ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1145 ప్రకారం గెస్ట్ లెక్చరర్స్‌ను యధావిధిగా కొనసాగిస్తూ వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతున్నానని కూనంనేని శ్రీనివాస్ రావు సిఎంకు విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News