Monday, April 29, 2024

దేశవ్యాప్తంగా పెరుగుతున్న మహిళా జడ్జిల సంఖ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందన్న సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ ధోరణి దేశవ్యాప్తంగా ఉందన్నారు. ‘ఒక సంతోషకరమైన వారను పంచుకోవాలని అనుకొంటున్నాం. కోర్టు రూమ్ వెనుక వరసలో మహారాష్ట్రనుంచి వచ్చిన సివిల్ జడ్జి జూనియర్ డివిజన్‌కు చెందిన 75 మంది జడ్జిలు ఉన్నారు. ఈ 75 మందిలో42 మంది మహిళలు కాగా 33 మంది పురుషులున్నారు’ అని శుక్రవారం విచారణ సందర్భంగా ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ‘సంఖ్యాపరంగా ఎక్కువ మంది మహిళా జడ్జిలు ఉంటున్నారు’ అని ఆయన అన్నారు. భోజన విరామ సమయంలో తాను ఈ జడ్జిలను కలుసుకుంటానని కూడా కూడా ఆయన చెప్పారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్యను

పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవేతో పాటుగా మరికొందరు న్యాయవాదులు ఈందర్భంగా చంద్రచూడ్‌ను కోరారు. ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలకు మూడింట ఒక వంతు స్థానాలను కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఇటీవల సిజెఐకు ఒక లేఖ రాశారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తూ పార్లమెంటు ఇటీవల బిల్లును ఆమోదించిన విషయాన్ని కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. పాట్నా, ఉత్తరాఖండ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరని, మిగిలిన 20 హైకోర్టులో 670 మంది పురుష న్యాయమూర్తులు ఉండగా, మహిళా జడ్జిలు 103 మంది మాత్రమే ఉన్నారని సిజెఐకు రాసిన లేఖలో సింగ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News