Monday, April 29, 2024

జమ్మూ కశ్మీర్‌కు రూ 1.18 లక్షల కోట్ల బడ్జెట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ 1.18 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రతిపాదించారు. ఈ బడ్జెట్‌లో రూ 20,760 కోట్ల ద్రవ్యలోటు, రాష్ట్ర స్థూల నికర అభివృద్ధి జిఎస్‌డిపిలో 7.5 శాతం వృద్ధిని ప్రస్తావించారు. వ్యయపెట్టుబడులను రూ 38,566 కోట్లుగా పేర్కొన్నారు. ఇది జిఎస్‌డిపిలో ఏడున్నర శాతంగా ఉంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ చెల్లింపులు రూ 97,861 కోట్లుగా అంచనావేశారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రం పటిష్ట చర్యలుతీసుకొంటోందని, ఈ క్రమంలో భద్రతా బలగాలు ఆద్యంతం పూర్తి అప్రమత్తత ప్రదర్శిస్తున్నాయని , సత్ఫలితాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి ఈ నేపథ్యంలో తెలిపారు. ఈ కోణంలోనే కేంద్ర బడ్జెట్‌లో ఇక్కడి భద్రతా పర్యవేక్షణలో ఉన్న భద్రతా బలగాల నిర్వహణకు తగు విధమైన నిధుల కేటాయింపులు జరిగాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News