Monday, April 29, 2024

సిఎం కెసిఆర్ నాయకత్వంలో పల్లెల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మగళవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో రు. 5 కోట్ల 8 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ… దేశంలోనే మొట్ట మొదటి సారి ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పథకంతో పల్లెల రూపు రేకలే మారిపోయాయన్నారు. ప్రతి గ్రామంలో రోడ్లు, అంర్గత డ్రైనైజి, వీదీ దీపాలు, నర్సరీలు, వైకుంఠ దామాలు, డంపిగ్ యార్డులు, ట్రాక్టర్ల పంపిణీతో గ్రామాల రూపు రేఖలే మారాయన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయలేని పనులు కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్‌ఎస్ చేసి చూపుతుందన్నారు. పచ్చదనానికి పెద్ద పీట వేయడమైనదన్నారు. మిషన్ భగీరత ద్వార ఇంటికి మంచి నీరు అందించడం జరిగిందన్నారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా తెలంగాణ రాష్ట్రంలో సాదించిన గోప్ప విజయమన్నారు. కరెంటు ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాద్యమవుతుందన్నారు. అభివృద్దిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి,జెట్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి,వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆత్మకమిటీ చైర్మణ్ కుమార్ గౌడ్ పలు గ్రామాల సర్పంచ్‌లు , బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News