Monday, April 29, 2024

54 లక్షల ఖాతాలకు రైతు బంధు నగదు

- Advertisement -
- Advertisement -

పంపిణీ 70శాతం పూర్తి

Rythu bandhu money give to 54 lakh farmers

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద 54.43 లక్షల మంది రైతుల ఖాతాలకు నగదు జమ పూర్తయింది. శనివారం 4.90 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1050.10కోట్లు నగదు పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రంలో ఐదురోజుల్లో మొత్తం రూ.5145.87కోట్లు 54.37లక్షల మంది రైతులకు చేరిపోయింది. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయంగా మొత్తం 63,25,695మంది రైతులకు సంబంధించిన 150.18లక్షల ఎకరాల విస్తీర్ణానికి గాను రూ.7508.78కోట్లు పంపిణీ చేయాల్సి వుంది.అందులో ఇప్పటి వరకూ 102.92లక్షల ఎకరాలకు సంబంధించిన 54.37లక్షల మంది రైతులకు నగదు పంపిణీ పూర్తయింది. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకూ 3,97,260 మంది రైతులకు రూ.401.92కోట్లు పంపిణీ జరిగింది. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 27,819మంది రైతులకు రూ.19.68కోట్లు పంపిణీ చేశారు. నల్లగొండ తర్వాత స్థానంలో నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 2,35,594మంది రైతుల ఖాతాలకు రూ.254.62కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 2,66,797మంది రైతుల ఖాతాలకు రూ.247.67కోట్లు జమ చేశారు.దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో రైతుబంధు నగదు పంపిణీ సాయం 70శాతంపైగా పూర్తయింది. ఆదివారం బ్యాంకులకు సెలువ కావటంతో ఇక మళ్లీ సోమవారం నుంచి నగదు పంపిణీ కార్రక్రమం కొనసాగనుంది. ఈ నెల 25నాటికి మిగిలిన రైతుల ఖాతాలకు నగదు జమ పూర్తి చేయనున్నారు.

పెరుగుతున్న సాగు విస్తీర్ణం:మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుబంధు పథకం కింద రైతులకు నగదు సాయం పంపిణీతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరుగుతూ వస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వస్తున్న పంటల దిగుబడులే ఇందుకు నిదర్శనం అన్నారు. ఆకలి కేకల తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో 4లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధం వున్న గోదాములను 29.26లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధానికి పెంచినట్టు తెలిపారు. రాష్ట్రంలోని గోదాములు, రైతువేదికలు, కాటన్ మిల్లులతోపాటు అవకాశం ఉన్న ప్రతిచోట ధాన్యం నిలువ చేశామన్నారు. వ్యవసాయ రంగానికి సిఎం కెసిఆర్ ఇచ్చిన ప్రాధాన్యత వల్లనే ఇది సాధ్యపడిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల గురించి విమర్శలు చేసే విపక్షాలు మందు ఇంత ఉత్పత్తి ఎలా సాధ్యమయిందో అర్ధం చేసుకుని మాట్లాడాలన్నారు. 201415లో వానాకాలం , యాసంగి కలిపి 24.29లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇప్పడు యాసంగిలోనే 90.04లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News