Sunday, April 28, 2024

రైతుబంధుతో అన్నదాతకు మేలు

- Advertisement -
- Advertisement -

సాగు సీజన్‌కు ముందే రైతన్న ముఖాల్లో ఆనందం
ధరణి పోర్టల్ ఆధారంగా ఈ పథకం వర్తింపు
ఈనెల 27 నుంచి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు జమ
సాయం అందజేతకు రూ.7,300 కోట్ల నిధుల సమీకరణ

Rythubandhu support to farmers in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధుతో రైతుల్లో ఆనం దం వెల్లివిరుస్తుంది. ఈ పథకం కింద లక్ష రూపాయలకు పైగా మించితే మొత్తం నగదును బ్యాంకులో జమచేయించుకుంటున్న రైతుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం యాసంగి సాగు నేపథ్యంలో రైతుబంధు ఆశలు జోరందుకున్నాయి. ఈనెల 27నుంచి రైతులఖాతాల్లో రూ.7,300 కోట్లు జమ కానున్నాయి. పెట్టుబడి నిమిత్తం రైతులు వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఈసారి ముందస్తుగా ప్రభుత్వం సాయం అందిస్తోంది.

ఈనెల 21 వరకు దరఖాస్తుల ఆహ్వానం

ఇప్పటికే సిఎం కెసిఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచి త కరెంట్, రైతు బీమా, దాన్యం కొనుగోళ్లు తదితర వాటి ని రైతులకు అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యం లో ఎటువంటి షరతులు, నియంత్రణలు లేకుండా ప్రభు త్వం సాయం అందచేస్తోంది. వానాకాలం సాయం అందించిన ప్రభుత్వం ప్రస్తుతం డిసెంబర్‌లో యాసంగి సాగు సీజన్ ఆరంభానికి ముందే ఈనెల చివరి వారం నుంచి నగదును బ్యాంకులకు అందించనుంది. నార్లు పోసుకొని పొలాలు సిద్ధం చేసుకున్న రైతుల్లో ప్రభుత్వం ఆత్మవిశ్వాసం నింపుతోంది. ఈ నేపథ్యంలో అన్నదాతల్లో హుషారు పెరిగింది. ధరణి పోర్టల్‌లో నమోదైన రైతుల వివరాల ఆధారంగా వ్యవసాయ శాఖ రైతుబంధు సా యం అందిస్తోంది.

కొత్తగా రైతులకు రైతుబంధు సాయం అందజేతకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈనెల21 వరకు గడువును నిర్ధేశించింది. గత వానాకాలం సీజన్‌లో జనవరి 16 వరకు ఆన్‌లైన్‌లో నమోదైన దరఖాస్తులకు రైతుబంధుని ప్రభుత్వం వర్తింపచేసింది. ప్రస్తుతం రైతుబంధు పథకానికి అర్హులు మండల పరిధిలోని వ్యవసాయ అధికారుల వద్ద పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం అందించాలని ప్రభు త్వం పేర్కొనడంతో రైతుల ఆశలు చిగురించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News