Saturday, April 27, 2024

ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్

- Advertisement -
- Advertisement -

S-N-Shrivastava

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. అల్లర్లకు కారణమని తెలిసిన పులువురిని సిట్ బృందాలు అదుపులోనికి తీసుకున్నాయి. వారి దగ్గరి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, నాటుతుపాకీలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లకు పాత నేరస్తులే కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది సిట్. ప్రస్తుతం మారణాయుధాలపై విచారణ చేస్తోంది. కాగా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా శ్రీవాత్సవకు పూర్తి స్థాయి అధికారాలను కట్టబెట్టింది సర్కార్. అల్లర్లు జరిగిన వెంటనే తాత్కాలిక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఇప్పుడు పాత కమిషనర్ అమూల్య పట్నాయక్ ను తొలగించి ఆయనకే పూర్తి భాద్యతలను అప్పగించింది.

ఇక ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రదేశాల్లో జాతీయ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్  రేఖా శర్మ శుక్రవారం పర్యటించనున్నారు. ఇద్దరు సభ్యులతో కలిసి ఆమె జఫరాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆమె నార్త్ ఈస్ట్ డిజిపి ఆఫీసుకు చేరుకున్నారు. సిఎఎ ఆందోళనకారులను గుర్తించాలంటూ పోలీసులు, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆందోళనలకు ఎవరు ఫండింగ్ చేశారో గుర్తించాలని ఆదేశాలు జారీచేసింది. ఏప్రిల్ 30న విచారణ జరపనుంది ఢిల్లీ హైకోర్టు. కాగా, దుకాణాలు తెరవాలంటూ స్థానికులకు పోలీసులు భరోసా ఇస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో గుర్గావ్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

S N Shrivastava appointed Delhi Police Commissioner

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News