Monday, April 29, 2024

2వేల కళాశాలల్లో సేఫ్టీ క్లబ్‌లు

- Advertisement -
- Advertisement -

Safety clubs

 

ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు, ఒక ఫ్యాకల్టీ మెంబర్‌తో ఒక్కొక్క సేఫ్టీ క్లబ్‌లో 15మంది సభ్యులు
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని 5 కళాశాలల్లో సేఫ్టీ క్లబ్‌లు పూర్తి
‘మన తెలంగాణ ప్రతినిధి’తో ఉమెన్స్ సేఫ్టీ విభాగం అధినేత, ఐజి స్వాతిలక్రా

మన తెలంగాణ/హైదరాబాద్ : సమిష్టి భాగస్వామ్యంతో మహిళల భద్రతలో రాష్ట్ర ఉమెన్స్ సేఫ్టీ విభాగం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని ఐదు కళాశాలల్లో ఈ సేఫ్టీ క్లబ్‌ల నియామకం పూర్తవ్వగా.. రాష్ట్రవ్యాప్తంగా 2000 కళాశాలల్లో సేఫ్టీ క్లబ్‌ల ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోందని ఉమెన్స్ సేఫ్టీ విభాగం అధినేత, ఐజి స్వాతి లక్రా తెలిపారు. బుధవారం ఆమె ‘మన తెలంగాణ ప్రతిని ధి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళల భద్రతకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో పాటు రానున్న కాలంలో మహిళల భద్రతకు తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలను ఆమె విశదీకరించారు. సేఫ్టీ క్లబ్‌లనేవి పోలీ సు శాఖలో వివిధ విభాగాల్లోనూ ఉన్నాయని, తమది మహిళా సేఫ్టీక్లబ్ అని వివరించారు. అలాగని ఆయా సేఫ్టీక్లబ్‌లో మహిళలకే కాదు.. కళాశాలల్లోని క్రేజీ బా య్స్‌కు సైతం అవకాశం కల్పిస్తున్నామన్నారు. తాము సేఫ్టీక్లబ్‌లో మెంబర్స్ అయ్యాము కాబట్టి.. ఇకపై తమకు బాధ్యతలు ఉంటాయన్న విషయాన్ని వారు పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.

కళాశాలల్లో మొత్తంగా 45 మందితో మూడు సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటవుతాయన్నారు. ఈ సేఫ్టీక్లబ్‌లలో ఫ్యాకల్టీ మెంబర్స్‌ను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. అక్కడ ఏమైనా మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై సమస్యలుంటే వెనువెంటనే ఉమెన్స్ సేఫ్టీ విభాగానికి తెలియపర్చే వీలుంటుందన్నారు. ‘చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం.. మహిళల భద్రతలో ముందడుగు వేద్దాం’ అనే కాన్సెప్ట్‌తో పాటు పోలీసు శాఖ మహిళల భద్రత కోసం చేపడతున్న వివిధ కార్యక్రమాలు ప్రజల్లోకి వేగంగా చొచ్చుకుని పోయేందుకు ఈ వినూత్న కార్యక్రమం ఉపకరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

30లక్షలు దాటిన హాక్ ఐ యాప్ డౌన్‌లోడ్‌లు
మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే అంశాలతో కూడిన హాక్‌ఐను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నదే తమ అభిమతమని, ఆ దిశగా ఈ సేఫ్టీక్లబ్ మెంబర్స్ సేవలు ఉపయోగపడగలవన్నారు. మహిళలకు ఎక్కడ ఏ ఆపదా వచ్చినా ఇప్పటికే పోలీసు శాఖ తరపున ప్యాట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పోలీసులతో కలిసి కళాశాలలో ఏర్పాటైన, ఏర్పాటు కాబోయే సేఫ్టీ క్లబ్ మెంబర్స్ సేవలు కూడా కలిస్తే మహిళల భద్రతకు మరింత భరోసా లభించగలదన్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య ౩౦ లక్షలు దాటేసిందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అయితే, కేవలం ౩౦ లక్షల మందే హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోదని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నదే తమ లక్షమన్నారు.

ఇదే క్రమంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితరాలకు సైతం స్పందన లభిస్తోందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100 సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆమె సూచించారు. తాము నూతనంగా ఏర్పాటు చేసిన, ఏర్పాటయ్యే సేఫ్టీక్లబ్ మెంబర్స్‌కు సైతం డయల్ 100 సేవల వినియోగ ఆవశ్యకతతో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితరాల ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే షీటీమ్స్‌తో పాటు పోలీసు సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకుంటారన్నారు. ఇదంతాఆచరణలోకి వచ్చి సక్సెస్ అయితే కార్పొరేట్‌లు ఇతరత్రా కార్యాలయాల్లోనూ సేఫ్టీక్లబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు.

త్వరలో షీటీమ్స్ ప్రత్యేక వెబ్‌సైట్
ఇప్పటివరకు షీటీమ్స్‌కు ప్రత్యేకంగా వెబ్‌సైట్ లేదని, దీంతో గూగుల్‌సెర్చ్ ద్వారా షీటీమ్స్ అని పలువురు సెర్చ్ చేయడం జరుగుతోందని ఐజి స్వాతిలక్రా పేర్కొన్నారు. వాటన్నింటికి చెక్ పెడుతూ బాధిత మహిళలు సత్వర న్యాయం పొందే విధంగా షీటీమ్స్ వెబ్‌సైట్‌కు త్వరలో రూపకల్పన చేస్తున్నామన్నారు. తద్వారా నేరుగా బాధిత మహిళలు వెబ్‌సైట్‌ని వీక్షించే అవకాశం ఉంటుందన్నారు. షీటీమ్స్ వెబ్‌సైట్ త్వరలో అందుబాటులోకి రానుందని ఆమె వెల్లడించారు.

Safety clubs in 2 thousand colleges
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News