Monday, May 6, 2024

నేను సైతం మోడీ బాటలోనే

- Advertisement -
- Advertisement -
Sanjay Raut says he follows PM Modi not wearing mask
మాస్కు ధరించడంపై సంజయ్ రౌత్ వ్యాఖ్య

నాసిక్: ఫేస్ మాస్కు లేకుండా ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న శివసేన ఎంపి సంజయ్ రౌత్ తాను ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకున్నట్లు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన రౌత్‌ను కరోనాను కట్టడి చేయడానికి పాటించాల్సిన నియమాలలో ఒకటైన ఫేస్ మాస్కును ఎందుకు ధరించలేదని విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ మాస్కు ధరించాలంటూ ప్రధాని మోడీ అందరికీ ఉద్బోధిస్తారు కాని తాను మాత్రం ధరించరని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మాస్కు తప్పనిసరిగా ధరిస్తారని, కాని దేశానికి నాయకుడైన మోడీ మాత్రం ధరించరని ఆయన ఎద్దేవా చేశారు. తాను ప్రధాని మోడీని అనుసరిస్తానని, అందుకే మాస్కు ధరించనని, ప్రజలు కూడా మాస్కులు ధరించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనా బహిరంగ సభలు, కార్యక్రమాలలో పాల్గొనే వారంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News