Friday, May 17, 2024

పవర్‌ఫుల్ లుక్‌లో…

- Advertisement -
- Advertisement -

Sarkaru vaari paata movie

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూకుడు మీదున్న మహేష్ బాబు, అటు సూపర్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్‌లపై మాస్ సాంగ్‌ని చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణ పూర్తయింది.

దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్‌ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు కళావతి, పెన్నీ.. ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. మూడవ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడో సింగిల్ టైటిల్ సాంగ్ శనివారం ఉదయం11:07 గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది.

ఇప్పటికే ఈ పాటకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు పవర్‌ఫుల్‌గా కనిపించి అంచనాలు పెంచారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News