Monday, April 29, 2024

25న ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు..

- Advertisement -
- Advertisement -

Sarva Darshan tokens to release on online from Sep 25th

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు రోజుకు 8 వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 26వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చైర్మన్ వివరించారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపారు.

Sarva Darshan tokens to release on online from Sep 25th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News