Monday, April 29, 2024

భూవాతావరణ వేడితో ప్రమాదంలో శాటిలైట్లు

- Advertisement -
- Advertisement -

భూ కక్ష్యలో ఉండే శాటిలైట్లకు రోజురోజుకూ సౌరజ్వాలల ప్రభావం కారణంగా ముప్పు ఎదురవుతోంది. భౌగోళిక అయస్కాంత తుఫాన్లు అంటే సౌరతుఫాన్లు శాటిలైట్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సూర్యుడి ఉపరితలం నుంచి వచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాలు భూమి పైకి దూసుకురావడాన్ని సౌర తుపానుగా పేర్కొంటారు. సూర్యుడి ఉపరితలంపై భారీ విస్ఫోటనం గంటకు 16 లక్షల కిమీ వేగంతో తుఫానుగా దూసుకువస్తుంటుంది.

ఈ సౌర తుఫాను భూమివైపు దూసుకువస్తే దాని ప్రభావంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌కు,జీపీఎస్ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని నాసా పేర్కొంది. భూ వాతావరణం కూడా విపరీతమైన వేడెక్కుతుందని శాస్త్రవేత్తలు ఇటీవల స్పేస్ వెదర్ కామ్ నివేదికలో పేర్కొన్నారు. సూర్యుని కరోనా నుంచి వెలువడే కణాలు ( కరోనా మాస్ ఎజెక్షన్స్ సిఎంఇ) భూ అయస్కాంత క్షేత్రంతో అనుసంధానమై అన్ని రకాల విద్యుత్, అయస్కాంత క్షేత్రాలకు విపరీతమైన ఆటంకాలను కలిగిస్తాయి. సూర్యుని చుట్టూ వలయంలా ఆవరించి ఉన్న వ్యవస్థను కరోనా అని అంటారు. ఇవి ప్లాస్మా నుంచి, అయస్కాంత క్షేత్రాల నుంచి వెలువడుతుంటాయి.

ఒకసారి సిఎంఇ విడుదలైతే అది అంతరిక్షం నుంచి ప్రయాణించి సౌరజ్వాలతోను, ఇతర గ్రహాల అయస్కాంత క్షేత్రాల తోను అనుసంధానమౌతుంది. ఆ తరువాత అది భూమికి చేరువైతే భూమి అయస్కాంత క్షేత్రానికి నష్టం కలిగిస్తుంది. ఫలితంగా భౌగోళిక అయస్కాంత తుఫాను సంభవిస్తుంది. అదనపు వేడి భూమి వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపించకపోయినా, భూమి దిగువ కక్ష లోని శాటిలైట్ల (ఉపగ్రహాలు) పై విపరీత ప్రభావం చూపిస్తుందని నాసా శాస్త్రవేత్త మార్టిన్ ఎమ్లిన్‌జాక్ చెప్పారు. సిఎంఇ వేగం, దిశ బట్టి, బలమైన శక్తిని బట్టి భూమిపై సిఎంఇ ప్రభావం అనేక రకాలుగా ఉంటుంది. సూర్యుని చర్యలు వేగం పుంజుకోవడంతో గత కొన్ని నెలలుగా భూమి అనేక భూఅయస్కాంత తుపాన్లను ఎదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News