Thursday, May 9, 2024

తెలంగాణలో బాణసంచాకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

SC has Amended High Court order on ban on fireworks

హైదరాబాద్: తెలంగాణ ఫైర్ వర్స్ డీలర్స్ అసోషియేషన్ కు సుప్రీంకోర్టులో స్వల్పఊరట లభించింది. రాష్ట్రంలో బాణసంచా కాల్చేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో టపాసులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పర్యావరణ హితమైన పటాకులను మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తూ హైకోర్టు నిషేధంపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అధిక కాలుష్య ప్రాంతాల్లో బాణసంచాపై పూర్తిగా నిషేధం విధించింది. సాధారణ గాలినాణ్యత ప్రాంతాల్లో 2గంటలపాటు క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీం ఒకే చెప్పింది. సాధారణ కాలుష్య ప్రాంతాల్లో రాత్రి 8-10 వరకు గ్రీన్ టపాసులకు అనుమతినిచ్చింది. దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు కూడా ఈ ఆంక్షలు వర్తింపజేసింది.

SC has Amended High Court order on ban on fireworks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News