Sunday, April 28, 2024

ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

- Advertisement -
- Advertisement -

కొత్త ఎన్నికల చట్టం కింద ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమిండంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎన్నికల కమినర్ల నియామకం కోసం జరగాల్సిన సమావేశాన్ని ముందుకు జరిపారని పిటిషనర్లు ఆరోపించగా వాస్తవాలను ఎత్తి చూపుతూ కొత్త పిటిషన్‌ను దాఖలు చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంక్ దత్తా, జస్టిన్ ఆగస్టిన్ జార్జి మసియాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్లను కోరింది. 2023 నాటి చట్టినికి అనుగుణంగా జరిపిన ఈ నియామకాలను నిలిపివేయడానికి బెంచ్ నిరాకరిస్తూ, సాధారణంగా మేము మధ్యతర ఉత్తర్వుల ద్వారా ఒక చట్టాన్ని నిలిపివేయం’ అని వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పలు పిటిషన్ల తదుపరి విచారణను బెంచ్ ఈ నెల 21కి వాయిదా వేసింది.

అయితే న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చినప్పుడు దాని అతిక్రమణ ఉండకూడదని పిటిషనర్ జయా ఠాకూర్ తరఫున హాజరయిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. ఈ సందర్భంగా ఆయన 2023 మార్చి 2న సుప్రీంకోర్టు తీర్పును చదివి వినిపించారు. ఎన్నికల కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కోసం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సిజెఐలతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆ తీర్పులో ఉందని ఆయన అన్నారు. అయితే పార్లమెంటు కొత్త చట్టం చేసే వరకు త్రిసభ్య కమిటీ పని చేస్తుందని ఆ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నవిషయాన్ని జస్టిస్ ఖన్నా న్యాయవాదికి గుర్తు చేశారు. గతంలో సుప్రీంకోర్టు తన తీర్పులకు అతిక్రమణగా ఉన్న ఆర్డినెన్స్‌లను నిలిపివేసిందని సింగ్ న్యాయస్థానానికి తెలియజేశారు. దీంతో దీనిపై కొత్తగా పిటిషన్ దాఖలు చేయాలని బెంచ్ ఆయనను ఆదేశిస్తూ ఈ నెల 21న మిగతా పిటిషన్లతో కలిపి దాన్ని విచారిస్తామని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News