Saturday, April 27, 2024

తరగతి గదిలో బాలిక స్కూల్‌ డ్రెస్ విప్పించిన టీచర్..

- Advertisement -
- Advertisement -

భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. గిరిజన బాలిక స్కూల్‌డ్రెస్ మురికిగా ఉందని ఆరోపించిన టీచర్ తరగతి గదిలో అంతా చూస్తుండగా డ్రెస్ విప్పించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఆ ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. షాడోల్ జిల్లాలోని గిరిజన గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల గిరిజన బాలిక స్కూల్ డ్రెస్ మురికిగా ఉండటాన్ని ఉపాధ్యాయుడు శ్రవణ్ కుమార్ త్రిపాఠి గమనించాడు. క్లాస్‌రూమ్‌లో అందరిముందు ఆ బాలికతో స్కూల్‌డ్రెస్ విప్పించాడు. దీంతో ఆమె కొన్ని గంటల పాటు కేవలం లోదుస్తులతో క్లాసులో ఉంది. టీచర్ శ్రవణ్‌కుమార్ అనంతరం మురికిగా ఉన్న గిరిజన బాలిక స్కూల్‌డ్రెస్‌ను ఉతికాడు. దీంతో ఆ డ్రెస్ ఆరేంతవరకు ఆ బాలిక కేవలం లోదుస్తులతో క్లాస్‌రూమ్‌లో కూర్చొంది. అయితే అంతటితో ఆగని ఉపాధ్యాయుడు శ్రవణ్ కుమార్ ఫోటోలు తీశాడు. తనను తాను పరిశుభ్రత వాలంటీర్‌గా పేర్కొంటూ ఆ ఫోటోలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం ఆ గిరిజన గ్రామస్థులకు తెలియడంతో ఆ టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ సంఘటనపై అధికారులు స్పందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉపాధ్యాయుడు శ్రవణ్‌కుమార్ త్రిపాఠిని శనివారం సస్పెండ్ చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ సహాయ కమిషనర్ ఆనంద్‌రాయ్ సిన్హా తెలిపారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు.

School girl dress removed by Teacher in Bhopal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News