Thursday, May 16, 2024

‘సీటీమార్’ టైటిల్ సాంగ్ ను విడుదల చేసిన సమంత

- Advertisement -
- Advertisement -

Seetimaarr Title Song released by Samantha

మ్యాచో హీరో గోపిచంద్, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరోహీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. ఈ మూవీకి సంప‌త్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా సీటీమార్‌ టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. అక్కినేని కోడలు, హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా ఈ పాటను విడుదల చేసింది. ప్రముఖ రచయిత కాస‌ర్ల శ్యామ్ రాయగా, మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో అనురాగ్ కుల‌క‌ర్ణి, రేవంత్‌, రామ్ పాడిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క‌బ‌డ్డీ గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపిచంద్, తమన్నా టీమ్ కోచ్‌లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక, రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Seetimaarr Title Song released by Samantha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News