Sunday, April 28, 2024

వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. రేపు భారత రిజర్వ్ బ్యాంక్ పాలసీ నిర్ణయం ఉన్నందున  మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.  ఓలటైల్ సెషన్‌లో బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208.24 పాయింట్లు లేక 0.33 శాతం పతనమై 62626.36 వద్ద, నిఫ్టీ 58.30 పాయింట్లు లేక 0.31 శాతం నష్టపోయి 18642.80 వద్ద ముగిసింది. దాదాపు 1565 షేర్లు లాభపడగా, 1825 షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 135 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా ముగిసాయి. నిఫ్టీలో ప్రధానంగా బిపిసిఎల్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్, యుపిఎల్ నష్టపోగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభపడ్డాయి. బిఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News