Monday, April 29, 2024

ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

Stock Market
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకుల సెషన్‌లో చివరికి మార్జినల్ లాసెస్‌తో ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 112.16 పాయింట్లు లేక 0.19 శాతం పతనమై 60433.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.20 పాయింట్లు లేక 0.13 శాతం పతనమై 18044.30 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 69.45 పాయింట్లు లేక 0.18 శాతం పతనమై 39368.80 వద్ద ముగిసింది. 1958 షేర్లు పెరుగగా, 1269 షేర్లు పతనమయ్యాయి, 162 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ముగిశాయి. కాగా ఎంఅండ్ ఎం, టాటామోటార్స్, హీరో మోటార్‌కార్పొ, ఓఎన్‌జిసి, ఎస్‌బిఐ షేర్లు లాభపడగా, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మారుతి సుజుకీ, జెఎస్‌డబ్లు స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. సెక్టారువారీగా చూసినప్పుడు ఆటో రంగం, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్స్ రంగం నష్టపోయింది. మెటల్, బ్యాంకింగ్ షేర్లు మాత్రం ఒత్తిడికి గురయ్యాయి. కాగా పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మ షేర్లలో కొనుగోలు కనిపించింది.   బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం పెరిగాయి. ఇదిలా ఉండగా మదుపరులు అమెరికా ద్రవ్యోల్బణం డేటా కోసం వేచి ఉన్నారు. మంగళవారం దేశీయ మార్కెట్లు పాజిటివ్‌గా ఓపెన్ అయినప్పటికీ ప్రపంచ మార్కెట్ మందకొడితనంతో తర్వాత ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ నేడు 18000 మార్కుపైనే ముగిసింది. అంటే అక్కడ ఓ స్ట్రాంగ్ బేస్‌ను రూపొందించుకుంది. నిఫ్టీ ట్రెండ్‌లైన్‌ను అనుసరించి రోజంతా కదలాడింది. ఏదిఏమైనప్పటికీ ఇంకా అనిశ్చితి ఉంది. ఉన్నత స్థాయిలో రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News