Monday, April 29, 2024

స్వల్ప లాభాలు

- Advertisement -
- Advertisement -

31 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్‌లో ట్రేడింగ్ జోరు కొనసాగింది. కానీ ట్రేడింగ్ చివరి గంటలో లాభాల బుకింగ్ కారణంగా గరిష్ఠ స్థాయి నుంచి కిందకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 71,386 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 21,544 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 680 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో ట్రేడయ్యాయి.

ఆటో, ఐటి, ఫార్మా, మెటల్స్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా, కమోడిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. మరోవైపు బ్యాంకింగ్, మీడియా, ఎఫ్‌ఎంసిజి, ఆర్థిక సేవల రంగాల షేర్లు క్షీణించాయి. ట్రేడింగ్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 15 లాభాల్లో, 15 నష్టాలతో ముగిశాయి. మార్కెట్ రోజు గరిష్ఠ స్థాయి నుంచి పడిపోయినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం లాభాలను ఆర్జించారు.

బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లు పెరిగి రూ.367.51 లక్షల కోట్లకు చేరుకుంది. గత సెషన్‌లో ఇది రూ.366.51 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్స్ విషయానికొస్తే, ట్రేడింగ్‌లో లార్సెన్ అండ్ టుబ్రో 1.55 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.50 శాతం, టాటా మోటార్స్ 1.32 శాతం, సన్ ఫార్మా 1.25 శాతం, టాటా స్టీల్ 1.21 శాతం, ఎన్‌టిపిసి 1.11 శాతం, టెక్ మహీంద్రా 0.97 శాతం పెరుగుదలతో ముగిశాయి. నెస్లే 1.03 శాతం, ఏసియన్ పెయింట్స్ 0.90 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.88 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.80 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.57 శాతం, టైటాన్ 0.37 శాతం పతనంతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News