Monday, April 29, 2024

వ్యాక్సిన్ ఉత్పత్తిని నిలిపివేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్

- Advertisement -
- Advertisement -

Adar Poonawalla

ముంబయి: కరోనా మహమ్మారి అంతగా లేనందున వ్యాక్సిన్ కు ‘ప్రైస్ ట్యాగ్’ పెట్టబోమని సెరమ్ ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్ పూనావాలా అన్నారు.  వ్యాక్సిన్ గ్యాప్ ను ఆయన తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించడాన్ని సమర్థించారు. మహమ్మారి మొదటి రెండు వేవ్ ల బాధలను ఇప్పుడు ప్రజలు ఎదుర్కొనడంలేదన్నారు. డబ్బు చేసుకోవడం తన ప్రధాన ఉద్దేశం కాదని, తనకు కావలసినంత డబ్బు ఇప్పటికే సంపాదించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ‘ వృథా చేయకుండా నేను ఉచితంగా కూడా వ్యాక్సిన్లు ఇచ్చాను. డబ్బు సంపాదించడమే నా ప్రధాన ఉద్దేశమైతే నేను అలా చేసేవాడినే కాను’ అన్నారు. ‘పిల్లవాడైనా, పెద్దవాడైనా వారికి నేను ప్రైస్ ట్యాగ్ పెట్టలేను. సెకండ్ వేవ్ అప్పుడే మేము ఓ నిర్ణయం తీసుకున్నాము. టైమ్స్ నెట్ వర్క్ ఏర్పాటు చేసిన  ‘ఇండియన్ ఎకనామీ కాన్ క్లేవ్’లో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పారు.

వృథాను అరికట్టేందుకు తమ కంపెనీ 2021 డిసెంబర్ 31 నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తిని నిలిపేసిందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ ధరను కూడా రూ. 600 నుంచి రూ. 225కు తగ్గించామన్నారు. ప్రస్తుతం తమ వద్ద 200 మిలియన్ల వయల్స్ నిల్వ ఉందన్నారు. దేశ విదేశాలలో ప్రయాణిస్తున్నందున బూస్టర్ డోస్ తప్పనిసరి అని ఆయన అన్నారు. అనేక దేశాలు ప్రయాణాలకు బూస్టర్ డోస్ ను తప్పనిసరి చేశాయని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 7 నుంచి 11 ఏళ్ల పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ల విషయంలో ప్రభుత్వ ఆమోదం కోసం వేచి ఉన్నామని పూనావాలా తెలిపారు. అయితే ఆ రకం వ్యాక్సిన్లను చాలా కాలంగా యూరొప్, ఆస్ట్రేలియాలకు సరఫరా చేస్తున్నామని కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News