Monday, April 29, 2024

ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై సెటైర్లు

- Advertisement -
- Advertisement -

Setairs on the RRR movie poster

మనతెలంగాణ, హైదరాబాద్ : ట్రిపుల్ ఆర్ సినిమా పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేయగా దానిని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరిచేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా పోస్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌలి దర్శకత్వంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. దానిలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హెల్మెట్లు పెట్టుకోలేదు. ఈ ఫొటోను సైబరాబాద్ ట్రాఫిక్ ఫోలీసులు ఇద్దరికి హెల్మెట్లు పెట్టి, ఇప్పుడు పరిపూర్ణంగా ఉందంటూ ట్వీట్ చేసింది. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఉండడండి అంటూ నినాదాన్ని ట్విట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ట్రిపుల్ ఆర్ టీమ్ ఇప్పటికీ ఆ పోస్టర్ పర్ఫెక్టె కాదంటూ ట్వీట్ చేసింది. నంబర్ ప్లేట్ మిస్ అయ్యిందంటూ కౌంటర్ ఇచ్చింది. నెటిజన్లు నంబర్‌ప్లేట్‌తో పాటు, హెడ్‌లైట్ కూడా మిస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News