Saturday, April 27, 2024

శరద్ పవార్‌కు గాల్ బ్లాడర్ సర్జరీ

- Advertisement -
- Advertisement -

బ్రీచ్ క్యాండీలో కోలుకుంటున్నారు: ఎన్‌సిపి

Sharad Pawar Undergoes Gall Bladder Surgery

ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్‌కు సోమవారం ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. 80 ఏళ్ల పవార్‌ను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆదివారం చేర్పించినట్లు మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సిపి నేత నవాబ్ మాలిక్ తెలిపారు. పవార్ గాల్ బ్లాడర్‌కు లాపరోస్కోపీ సర్జరీ విజయవంతంగా జరిగిందని మాలిక్ ఒక ప్రకటనలో తెలిపారు. పవార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నారని మాలిక్ పేర్కొన్నారు. కాగా..గత నెలలో అస్వస్థతకు గురై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన పవార్‌కు మార్చి 30న మూత్రపిండాలలో రాయిని ఎండోస్కోపీ ద్వారా తొలగించారు. 15 రోజుల తర్వాత సర్జరీ చేయవలసి ఉంటుందని, విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ పవార్‌ను అపుడు డాక్టర్లు ఇంటికి పంపివేశారు. తిరిగి సర్జరీ కోసం ఆదివారం పవార్ ఆసుపత్రిలో చేరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News