Sunday, April 28, 2024

శివరాత్రి రోజున బయటపడిన శివలింగం

- Advertisement -
- Advertisement -

మహాశివరాత్రి రోజున మహాశివుడు శివలింగంగా ఉద్భవించాడని పురాణాల్లో చెబుతుంటారు. నిజంగా మహాశివరాత్రి రోజున శివలింగం వెలసిన సంఘటన సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండల పరిధి, సర్వారం గ్రామ శివారులోని నల్లగుట్ట వద్ద జరిగింది. స్థ్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడి దుర్గయ్య-కోటమ్మల కుమారుడు పగిడి గోపి 12 సంవత్సరాల నుండి మాంసాహారాలు మానేసి శివపూజ చేస్తున్నాడు.

అతనికి కొంతకాలంగా శివుడు కలలో కనిపించి గుట్ట మీద వెలిశానని చెబుతుండడంతో గోపి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి చూడగా కొండపైన ఉన్న పుట్టలో శివలింగం బయటపడింది. వెంటనే గోపి గ్రామ పూజారికి, పలువురికి ఫొటోలు తీసి పంపగా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అని అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి రోజున శివలింగం వెలసిన విషయం తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News